
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మంత్రిని దబాయించి మరీ టెండర్ ఫైల్ పై ఓ పెద్దాయన సంతకం పెట్టించాడట.. అధికార వర్గాలు దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం టెండర్ ను ఓ కంపెనీకి కేటాయించడానికి మంత్రి సిద్ధమయ్యారు.
కానీ ఓ పెద్దాయన అ కంపెనీకి ఇవ్వకుండా మరో కంపెనీకి టెండర్ ను కట్టబెట్టేందుకు మంత్రిని సంతకం పెట్టమన్నారు. ఇదంతా సచివాలయంలో సంచలనం సృష్టిస్తోంది.
ఇంతకీ ఆ పెద్దాయన ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. మంత్రిని సంతకం పెట్టించే ధైర్యం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికే సాధ్యం., ఆయనే మంత్రి ఆదేశించగలరు.. సంతకం పెట్టించగలరు.. ఇప్పుడా పెద్దాయన మ్యాటర్ సచివాలయంలో హల్ చల్ చేస్తోంది. కాంట్రాక్టర్లను మార్చి టెండర్లు అస్మదీయులకు కట్టబెడుతున్నారని సమాచారం.