మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ x టీడీపీ

2014-11-06_190346_KCR-Errabelli_Dayakar_Rao_War_At_BAC

తెలంగాణ శాసనమండలి ఎన్నికలు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. టీఆర్ఎస్ టీడీపీలు వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నాయి. టీడీపీ తనపార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ ఎలాగైనా టీడీపీ ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకొని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. రెండు రోజులుగా ఈ హీట్ తారాస్థాయికి చేరింది.

నిన్న ఎర్రబెల్లి, రేవంత్ కేసీఆర్, టీఆర్ఎస్ తీరు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీకి చెందిన కుతుల్బాపూర్ ఎమ్మెల్యే ఇటీవలే టీఆర్ఎస్ వైపు ఆకర్శితులు కావడంతో ఆయన ఓటు పడుతుందా లేదా అనే సందిగ్ధంలో టీడీపీ ఉంది. విప్ జారీ చేయాలని చూస్తోంది.

కాగా టీడీపీ ఎమ్మెల్యేలను ఎలాగైనా చీల్చి దెబ్బకొట్టాలనే వ్యూహంతో అధికార పార్టీ పావులు కదుపుతోంది. దీంతో మండలి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. జూన్ 1 న జరిగే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 5 స్థానాలు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *