మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ లేకుండా చేద్దాం

TRS_1687139f

హైదరాబాద్ : శాసనమండలి కి ఎమ్మెల్యే కోటలో జరిగే ఎన్నికల్లో ఆరుస్థానాలకు టీఆర్ఎస్ కు అయిదు స్థానాలు కచ్చితంగా రావాలని..పార్టీ బలపరిచిన అభ్యర్థులందరిని గెలిపించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరారు. తెలంగాణ భవన్ లో పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు దిశానిర్ధేశం చేశారు.

మండలి ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని కేసీఆర్ వివరించారు. ఒక్క ఓటు కూడా వృథా కారాదని.. అందరి కోసం నమూనా పోలింగ్ ను శనివారం నిర్వహిస్తామన్నారు. మండలి ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ముందుకు వస్తున్నారని చెప్పినట్లు తెలిసింది. మండలిలో టీడీపీకి స్థానం లేకుండా చేయడమే మన ధ్యేయమని పునరుద్ఘాటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *