
తెలంగాణలో శాసనమండలి పట్టభద్రుల రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానాలకు ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఓట్లు వేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో మొత్తం 54 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. హైదరాబాద్ స్థానం నుంచి దేవీ ప్రసాద్ (టీఆర్ఎస్), ఎన్. రాంచందర్ రావు(బీజేపీ) లు హోరాహోరీ తలపడుతున్నారు. ఇక్కడ గెలుపు నువ్వా నేనా అన్నట్టు ఉండబోతోంది. ఇక వరంగల్ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి (టీఆర్ఎస్), ఎర్రబెల్లి రాంమోహన్ రావు (బీజేపీ) లు కూడా తగ్గ పోరు నడుస్తోంది. ఈ నెల 25న ఓట్లలెక్కింపులో ఎవరో గెలుస్తారో తేలనుంది.