మంచు విష్ణు ‘డైనమైట్ ‘

– దేవాకట్టా దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోన్న చిత్రం

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై  ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విష్ణు పెర్ ఫార్మెన్స్, లుక్ కి సరిపొయే విధంగా ఈ సినిమాకి ‘డైనమైట్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉందని టైటిల్ కి తగిన విధంగానే సినిమా ఉంటుందని విష్ణు తెలియజేశారు. చెవి పోగు, చేతి పొడవునా టాటూతో డిఫరెంట్ లుక్ తో మంచు విష్ణు కనువిందు చేయనున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రేక్షకులు, అభిమానులను అలరించే విధంగా ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కతుందని, ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్రయూనిట్ తెలియజేస్తుంది.

ట్వీట్టర్ లో మంచు విష్ణు

vishnu

హీరోగా, నిర్మాతగా తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న మంచు విష్ణు సోషల్ మీడియా వ్యవస్థలో భాగమైన ట్వీట్టర్ లో జాయినయ్యారు. @iVishnuManchu పేరుతో ట్వీట్టర్ లో జాయిన్ కావడం ఆయన అభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. వెంటనే ఆయన అభిమానులు ట్వీట్టర్ లో మంచు విష్ణుని ఫాలో కావడం మొదలు పెట్టారు. ఈ ట్వీట్టర్ అకౌంట్ ద్వారా మంచు విష్ణు సినిమాలకు, ప్రొడక్షన్ కి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చుననే అభిమానులు సంతోషపడుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు సందర్భంగా ట్వీట్టర్ లో జాయిన్ అయిన విష్ణు ‘విన్ని, నువ్వు ఉన్న ఈ జీవితం వండర్ ఫుల్ గా ఉంది. నీకు మాట ఇచ్చినట్లుగానే ట్వీట్టర్ లో రీ జాయిన్ అయ్యాను’ అని ట్వీట్ చేశారు.

ఏడాది క్రితం మంచు విష్ణు ట్వీట్టర్ లో యాక్టివ్ గా ఉండేవారు. అయితే ఆ అకౌంట్ ను ఎవరో హ్యక్ చేయడంతో అప్పట్లో ట్వీట్టర్ నుండి వైదొలిగిన మంచు విష్ణు తర్వాత ఇప్పుడు ట్వీట్టర్ లో జాయినయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *