మంచిర్యాల నుంచి ఖమ్మంకు పొడగించండి

తెలంగాణకు ఇచ్చిన జాతీయ రహదారిని నిన్న కేంద్ర మంత్రి గడ్కరీ  ఖమ్మంలో ప్రకటించిన ప్రారంభోత్సవం చేసిన సంగతి తెలిసిందే.. అయితే జాతీయ రహదారి 563ను ఖమ్మం వరకు పొడగించాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాశారు.

రాష్ట్ర విభజన హామీల మేరకు కేంద్రం మూడు జాతీయ రహదారులను తెలంగాణకు కేంద్రం మంజూరు చేసింది.. 563 నంబర్ రహదారి మంచిర్యాల నుంచి మొదలై కరీంనగర్, హుజూరాబాద్ మీదుగా వరంగల్  వరకు మంజూరు చేశారు.  దీన్ని పీపీపీ పద్ధతిన నిర్మిస్తారు. ఇప్పటికే టెండర్ పూర్తయ్యింది.  అయితే ఈ రహదారిని ఖమ్మం వరకు పొడగించాలని లేఖలో సీఎం కోరారు. దీనివల్ల మహారాష్ట్రకు ఉత్తర తెలంగాణకు అనుసంధానమై అభివృద్ది చెందుతుందని.. దాంతో పాటు ఆంధ్రాలోని ఓడరేవులకు తెలంగాణకు అనుసంధానం ఏర్పడుతుందని ఆయన లేఖలో కోరారు. దీనిపై కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పదించి నిధులు మంజూరు చేస్తానని ఖమ్మంలో మంత్రి తుమ్మలకు హామీ ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *