
మంచిర్యాలలో ఓ దొంగ స్వామిజీ , ముగ్గురు మహిళలు ముఠా ఏర్పడి మహిళలతో నగ్న పూజలు చేయిస్తున్నారు. దీనివల్ల కనక వర్షం కురుస్తుందని.. మీకు ఆర్థిక బాధలు తొలుగుతాయని నమ్మిస్తున్నారు. వరంగల్ జిల్లా మహబూబాద్ కు చెందిన ముగ్గురు మహిళలు సుల్తానా బేగం, మహబూబీ, కబిరున్నీసాలు మంచిర్యాలలోని స్వామిజీతో కనెక్షన్ పెట్టుకొని మహబూబ్ బాద్ లోని పేద, మధ్యతరగతి మహిళలకు వల వేస్తున్నారు.
మీకు డబ్బుల వర్షం కురుస్తుందంటూ నగ్నం పూజలు చేస్తే మీ పైసలు కుప్పలుగా వస్తాయంటూ నమ్మించి అమాయ మహిళలను మంచిర్యాలలో వివస్త్రలను చేసి నగ్నంగా పూజలు చేయిస్తున్నారు.దొంగ బాబా మహిళలను నగ్నం పూజలు చేయిస్తూ మోసం చేస్తున్నాడు. పూజలు అయిన పోయిన తర్వాత మోసపోయిన మహిళల్ని బెదిరిస్తున్నారు.
కాగా దీనిపై ఆ ముగ్గురు మహిళా నిందుతుల్ని నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.