Breaking News

మంగళవారం రోజు సూర్యాపేట ఏరియా ఆస్సత్రిని తనిఖీ చేసిన మంత్రి ఈటెల

మంగళవారం రోజు సూర్యాపేట ఏరియా ఆస్సత్రిని తనిఖీ చేసిన మంత్రి ఈటెల

సూర్యాపేట: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

సూర్యాపేట ఏరియా ఆస్పత్రిని మంత్రి ఈటెల నేడు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ అమెయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు చిన్నారులకు రోటా టీకాలు వేశారు. వైద్యకళాశాల విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం చేపట్టిన సమీక్షలో ఆస్పత్రిలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి మంత్రులు ఆరా తీశారు. సమావేశం అనంతరం మంత్రి ఈటెల మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల పాటు సెలవులు పెట్టవద్దని వైద్యులు, సిబ్బందికి సూచించినట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై ప్రతి జిల్లాలో మంత్రులు సమీక్ష చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

eatela rajender 1eatela rajender 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *