మంగళవారం ఫేస్ బుక్ కి కష్టాలే..

ప్రతీ మంగళవారం నాడు కేవలం 2జీ నెట్ వర్క్ నే వాడాలని.. ఇందుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ చెప్పారు. భారత దేశంలో పర్యటిస్తున్న జుకర్ ఇవాళ ఢిల్లీ ఐఐటీ విద్యార్థుల సమావేశంలో మాట్లాడారు. భారత్ వంటి చాలా దేశాల్లో 2జీ తోనే ఫేస్ బుక్ వాడుతున్నారని.. వారి బాధలు తెలియాలంటే తమ ఉద్యోగులు 2జీనే ప్రతీ మంగళవారం వాడాలని అప్పుడే ఫేస్ బుక్ సమస్యలు పరిష్కారమవుతాయని జుకర్ స్పష్టం చేశఆరు. తమ స్టాఫ్ కు 2జీ ప్రాబ్లమ్స్ ఏ విధంగా నివారించాలో తెలియజెప్పడమే తన ఉద్దేశమన్నారు.

దీని ప్రకారం ఇక ఫేస్ బుక్ కార్యాలయాల్లో 2జీ సర్వీసు మాత్రమే అందుబాటులో ఉంటుంది.. దీంతో ఇన్నాల్లు హ్యాపీగా ఉన్న ఫేస్ బుక్ ఉద్యోగులు ఇప్పుడు అధినేత జుకర్ నిర్ణయంతో ఖంగుతిన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *