
జీఏ-2 (ఎ డివిజన్ ఆఫ్ గీతాఆర్ట్స్) బాన్యర్ లో ఎస్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ గారు సమర్పణలో, మిర్చి, రన్‌రాజారన్ లాంటి సూపర్‌డూపర్ హిట్స్ ని సొంతం చేసుకుని క్రేజి ప్రోడక్షన్ హౌస్ యువి. క్రియేషన్స్ సంయుక్తంగా ప్రోడక్షన్ నెం-1 గా ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాన్ని ఈరోజు ఫిల్మినగర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. నాని, లావణ్య త్రిపాఠి లు జంటగా నటిస్తున్నారు. వరుస విజయాలతో యూత్ లో ఐకాన్ డైరక్టర్ గా బ్రాండ్ వేసుకున్న మోస్ట్ క్రేజియస్ట్ డైరక్టర్ మారుతి దర్శకుడు. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిహ్యాట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ టాలెంటెడ్ నిర్మాత బన్నివాసు నిర్మాత.
ఈ సందర్భంగా నిర్మాత బన్నివాసు మాట్లాడుతూ.. ‘మారుతి చెప్పిన కథ చాలా ఎంటర్టైనింగ్ గా వుంది. మారుతి గతంలో చేసిన చిత్రాలకంటే ఈ చిత్రం ఫుల్ అవుటండ్ అవుట్ లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా వుంటుంది. నాని, లావణ్య త్రిపాఠి లు హీరోహీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఫిల్మ్‌నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దైవసన్నిధానంలో పూజాకార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అల్లు అరవింద్ గారు స్వామివారిపై క్లాప్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రం ఈరోజు నుండి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అగష్టు లో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నహలు చేస్తున్నాము..’ అని అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. జిఎ 2 (ఎ డివిజన్ ఆఫ్ గీతాఆర్ట్స్) & యువి. క్రియేషన్స్ ప్రోడక్షన్ నెం-1 గా తెరకెక్కుతున్న ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం రెగ్యులర్ షూట్ ఈరోజు నుండి పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. చక్కటి ఎంటర్టైన్మెంట్ వున్న చక్కటి లవ్ స్టోరి. చక్కగా సినిమా అంతా నవ్వుకునే చిత్రం గా అందరి ప్రశంశలు పొందుతుంది. అని అన్నారు..
నటీనటులు : నాని, లావణ్య త్రిపాఠి, మురళి శర్మ, నరేష్, సితార, స్వప్న మాధురి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, బద్రమ్, మరియు తదితరులు..
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: ఎస్.కె.ఎన్, ఎడిటర్: ఉద్దవ్, ఆర్ట్ :రమణ లంక, సంగీతం :గోపి సుందర్, ఫొటొగ్రఫి :నిజార్ షఫి, నిర్మాత :బన్నివాసు, రచన, దర్శకత్వం: మారుతి