భూ సమస్యలకు తక్షణ పరిష్కారం

కరీంనగర్: పేద ప్రజలు, రైతుల భూముల సమస్యలు ప్రభుత్వ ఉత్తర్వుల కనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహ్మద్ మమమూద్ అలీ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. జి.ఒ. నెం. 58, 59 సాదాబైనామా, విరాసత్, మ్యుటేషన్ల ధరఖాస్తులను వెంటనే నిబంధనల మేరకు పరిష్కరించాలని అన్నారు. 277 మంది సర్వేయర్లను నియమించినున్నట్లు ఆయన ఏర్పాటు చేయాలని అన్నారు. అక్రమిత ప్రభుత్వ భూములు, ప్రస్తుతం ఆధీనంలో ఉన్న భూముల వివరాలు తెలియజేయాలని అన్నారు. రెవెన్యూ కార్యాలయాలకు పక్కాభవనాలు, సాధారణ ఖర్చులు, విద్యుత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ. ప్త్ర్రెవేటు భూముల్లో మొక్కలను లక్ష్యానికి అనుగుణంగా నాటాలని అన్నారు. సాదాబైనామా కింద ఉచితంగా రిజిస్ట్ర్రేషన్ చేయడానికి రాష్ట్ర్ర వ్యాప్తంగా 12 లక్షల ధరఖాస్తులు వచ్చాయని అన్నారు. రెవెన్యూ సిబ్బంది అంకిత భావంతో 100 శాతం పనులు పేద ప్రజల కోసం నిర్వహించాలని అన్నారు. రాష్ట్ర్ర ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ అధికారులు శాఖా పరమైన పనులు నిరంతరంగా నిర్వహించాలని, జఠిల సమస్యల పై ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. దళారులు, సమస్యలు సృష్టించే వారిపై చర్యలు చేపట్టాలని
అన్నారు. కింది స్ధాయి ఉద్యోగులను సెన్సిటైజ్ చేయాలని అన్నారు. గ్రామస్ధాయి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని రెవెన్యూ అధికారులను కోరారు. గ్రామాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తృతంగా అందించాలని క్లోరినేషన్, పారిశుద్ద్య పనులు, త్రాగునీటి సరఫరా పైపు లీకేజి వంటివి పరిశీలించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, ఇందుకు గ్రామాల్లోని శాఖాధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వర్షాభావ పరిస్ధితుల నేపధ్యంలో జ్వరాలు, వైరల్ జ్వరాల బారిన పడకుండా అవసరమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. 104, 108 వాహనాల సేవలను మరింతగా విస్తృత పరచాలన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్ధాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు నిర్వహించాలని అన్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమయంలో వైద్య సిబ్బందికి ఎలాంటి సెలవులు ఇవ్వకూడదని అన్నారు. తీవ్ర వ్యాధులతో బాధ పడుచున్న వారికి తక్షణ వైద్య సేవలను అందించేందుకు నిధులను నిజంగా అవసరమైన పక్షంలో మంజూరు చేస్తామన్నారు. హరితహరం కార్యక్రమంతో రాష్ట్ర్రంలో కరీంనగర్ జిల్లా నాల్గవ స్ధానంలో ఉందని, గుట్టపై, కింది భాగాలు, కేనాల్ బండ్స్, ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లో నాటాలని అన్నారు. ఈ నెల 15 లోగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచడం జరిగిందని, గ్రామాల్లో పారిశుద్ద్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గోదావరి అంత్య పుష్కరాలు సందర్భంగా ధర్మపురి, కాళేశ్వరంలో స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ద్య పనులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ దేవసేన, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక, ఆర్టీఓలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రాజేశం తహసీల్దార్లు, పి.హెచ్.సి.ల డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టరేటులో డిప్యూటి ముఖ్యమంత్రి మొక్కలను నాటారు.mahamod ali

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *