Breaking News

భూమి కొనుగోలు పధకానికి రైతులు సహకరించాలి: నీతూ ప్రసాద్

భూమి కొనుగోలుకి పధకానికి సహకరించాలి: నీతూ ప్రసాద్

కరీంనగర్: భూమి కొనుగోలు పధకం క్రింద ప్రభుత్వం ద్వారా భూసేకరణకు రైతులు సహకరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రువారం కరీంనగర్ కలెక్టరేటు సమావేశ మందిరంలో జమ్మికుంట, బోయిన్ పల్లి, కోనారావుపేట, కాటారం మండలాల్లో భూమి అమ్ముటకు ముందుకు వచ్చిన రైతులతో ధర నిర్ణయంపై సంధి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ దళితులకు 3ఎకరాల భూ పంపిణి కొరకు భూమి కొనుగోలు చేస్తున్నట్లు, జమ్మికుంట మండలం, నగురం గ్రామంలో 5.22, బోయిన్ పల్లి మండలం, కోరెం గ్రామంలో 26.01, తడగొండ గ్రామంలో 27, కోనారావు పేట మండలం, పల్లిమక్త గ్రామంలో 11.13, కాటారం మండలం, ధర్మసాగర్ గ్రామంలో 9, ప్రతాపగిరి గ్రామంలో 54.5, మొత్తం 134.06 ఎకరాల భూమి అమ్ముటకు ముందుకు వచ్చిన రైతులతో భూమి పరిస్ధితిని బట్టి ధర నిర్ణయించారు. రైతుల సమ్మతి అనంతరం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న ఇట్టి పధకానికి భూమి అమ్మబోవు రైతులు ముందుకు వచ్చి సంబంధిత తహసిల్దార్ కార్యాలయాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు సంయుక్త కలెక్టర్ డా.ఏ. నాగేంద్ర, కరీంనగర్, మంధని ఆర్గీవోలు చంద్రశేఖర్, శ్రీనివాస్, భూగర్భజల శాఖ సహయ సంచాలకులు హరికుమార్, తహసిల్దార్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *