Breaking News

భూమా పీచేముడ్.. వైసీపీలోనే కొనసాగింపు

Shobha_Nagi_Reddy_with_her_husband

కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మెత్తబడ్డారు. టీడీపీలో చేరుతారనే ప్రచారం జరగడంతో ఆయనపై ఒక్కసారిగి వైసీపీ అధినేత జగన్ దృష్టిసారించారు. తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. జగన్ , వైసీపీ నాయకురాలు విజయలక్ష్మీలు నాగిరెడ్డి, అఖిలప్రియతో ఫోన్లో మాట్లాడి పార్టీ మారకుండా చేసిన ప్రయత్నాలు ఫలించాయి.. దీంతో భూమా తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు..
నిన్నటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి పొందుతారని ప్రచారం జరిగింది. ఆయనతో చంద్రబాబు సంప్రదించారని కూడా తెలిసింది. దీంతో జగన్ అలర్ట్ అయ్యి రాయబారాలు నడపడంతో భూమా వెనక్కి తగ్గారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *