
భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.15 కోట్లు మంజూరయ్యాయి. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల భూపాలపల్లి మున్సిపాలిటీ సమీక్ష సందర్భంగా అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి గారి ఆమోదంతో నిధులు మంజూరు చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు నిధులు విడుదలయ్యాయి. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధుల విడుదలపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు.