భూపాలపల్లికి కానుకగా కాళేశ్వరం- కాళేశ్వరం తొలిఫలితం ఓరుగల్లుకే.

IMG-20180412-WA0300భూపాలపల్లికి కానుకగా కాళేశ్వరం.
# కాళేశ్వరం తొలిఫలితం ఓరుగల్లుకే.
# దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల తనిఖీ.
# పనుల పురోగతిపై సమీక్ష.
# యుద్ధప్రాతిపదికన తుపాకులగూడెం.
# 15 రోజుల్లో మళ్ళీ వస్తా.
# కాలువల వెంట బులెట్ పై తిరుగుతా.
# ఇరిగేషన్ సర్క్యూట్ గా నర్సంపేట.
#చారిత్రక రామప్ప ను కాపాడేందుకు పైప్డ్ ఇరిగేషన్.
# దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజి 2 పనులను జూలై 31 లోపు పూర్తి చేయాలి.
# ప్రజలకు నీళ్ళు-కాంగ్రెస్ నేతలకు కన్నీళ్లు.
# అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులలో కేసులు.
———————————————————–

కాళేశ్వరం ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కానుకగా ఇస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తొలి ఫలితం ఉమ్మడి వరంగల్ జిల్లాకు దక్కుతుందని ఆయన అన్నారు. కాళేశ్వరం పూర్తి కావస్తున్నందున ఎల్లంపల్లి-మిడ్ మానేరు-లోయర్ మానేరు డ్యాం మీదుగా ఎస్.ఆర్.ఎస్.పి.ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని మంత్రి హరీశ్ రావు తెలియజేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీశ్ రావు గురువారం విస్తృతంగా పర్యటించారు.వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించారు.

తెలంగాణలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మైండ్ బ్లాంక్ అవుతున్న కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా కోర్టు కేసులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నట్టు మంత్రి చెప్పారు.కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ కు చెందిన విష్ణు వర్ధన్ రెడ్డి ఈ రోజు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారని ఆయన చెప్పారు.రైతులు, ప్రజలకు సాగు,తాగు నీళ్ళు వస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయని హరీశ్ రావు అన్నారు.దేవాదుల,తుపాకులగూడెం ప్రాజెక్టులను మంత్రి హరీశ్ రావు గురువారం సందర్శించారు.దేవాదుల ఫేజ్-3 పనులు శరవేగంగా జరుగుతున్నట్టు మంత్రి హరీశ్ రావు భూపాలపల్లిలో మీడియాకు తెలిపారు.వర్శాకాలం లోపున తుపాకులగూడెం సిమెంటు కాంక్రీటు పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.మొత్తం 4.50 లక్షల క్యూబిక్ మీటర్ల పనులకు గాను కేవలం 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయని అన్నారు. తుపాకులగూడెం పనులు నెమ్మదిగా జరుగుతుండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తుపాకులగూడెం పూర్తయితేనే 10 నెలలపాటు దేవాదుల పంపులు నిరంతరాయంగా పనిచేస్తాయని ఆయన గుర్తుచేశారు. తుపాకులగూడెం వల్ల దేవాదుల ప్రాజెక్టు పరిధిలో 6 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుందన్నారు. తుపాకులగూడెం బ్యారేజి పూర్తయితే ప్రతి ఏటా 100 టి.ఎం.సి.లను ఎత్తి పోసుకోవచ్చునని మంత్రి అన్నారు.రామప్ప నుండి మొత్తం మూడు లింకులు ఉన్నాయని ఆయన చెప్పారు. పాకాల, ములుగు ఘన్పూర్, లక్నవరం లింకులను జులై చివరి నాటికి పూర్తి చేసి దేవాదుల ద్వారా గోదావరి జలాలతో నింపుతామని హరీశ్ రావు తెలిపారు. ములుగు ఘన్పూర్ ని రిజర్వాయర్ గా మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రామప్ప దేవాలయం లో అండర్ గ్రౌండ్ పనులు రద్దు చేసి ఓపెన్ పైపులైన్లతో పనులు చేస్తున్నామని వివరించారు.8100 ఎకరాలు రామప్ప కింద ప్రస్తుతం ఆయకట్టు సాగు అవుతున్నదని చెప్పారు.రామప్ప నుండి పాకాలకు లింకు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని మంత్రి అధికారయంత్రాంగాన్ని అదేశించారు. ఇందుకోసం 132 కోట్లు మంజరైనట్టు చెప్పారు.పాకాల కింద 28 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. దేవాదులకు వీటిని లింక్ చేయడం వల్ల రెండు పంటలు పండనునున్నాయని హరీశ్ రావు అన్నారు.మరో 15 వేల ఎకరాల కొత్త ఆయకట్టు రానుందని ఆయన వివరించారు.రామప్ప నుండి లక్నవరం లింకు కు 17 కోట్లు మంజూరు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.దేవాదుల ప్యాకేజీ 5 పనులను కూడా సమీక్షించినట్టు మంత్రి తెలిపారు. ఎస్ ఆర్ ఎస్పీ ద్వారా 83 వేల ఎకరాలకు భూపాలపల్లి నియోజకవర్గంలో నీరు అందించాల్సి ఉంటే కాంగ్రెస్ నాయకులు కాగితాల మీదనే నీళ్లు చూపించారని విమర్శించారు.మరో 15 రోజుల్లో మళ్ళీ వస్తానని మంత్రి ప్రకటించారు. ఈ సారి ఎస్ ఆర్ ఎస్పీ కాలువల వెంట బుల్లెట్ మీద తిరుగుతానని ఆయన తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో లక్ష 90 వేల ఎకరాల కు సాగుభూమి ఉందని ఆయన చెప్పారు. ఎస్.ఆర్.ఎస్.పి.కాలువల ద్వారా 83 వేల ఎకరాలు, మైనర్ ఇరిగేషన్ కింద 50 వేల ఎకరాలు, ములుగు ఘనపురం-రామప్ప లింకు స్వారా 24 ఎకరాలకు ఆయకట్టుకు నీరందిస్తామని మంత్రి హరీశ్ రావు తెలియజేశారు.పనులను మరింత వేగవంతం చేయాలని ఇంజనీర్లను ఆదేశించామని చెప్పారు.అలాగే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అమేయ కుమార్ ను అదేశించినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యే లోపు ఆయా నియోజకవర్గాల్లోని కాల్వలను ఆధునీకరణ చేస్తున్నామని మంత్రి తెలిపారు. 8 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రాజెక్టులను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దేవాదుల ప్రాజెక్టుతో పూర్వ వరంగల్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు చెప్పారు. తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణం పూర్తయితే 365 రోజులు 100 టీఎంసీల నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉంటుందన్నారు. తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణం కోసం చేపట్టిన కాఫర్‌ డ్యాంతో వర్షాకాలంలో కూడా కాంక్రీటు పనులు చేయవచ్చునని తెలిపారు.తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.2019 నాటికి తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణంతో పాటు దేవాదుల ఫేజ్-‌3 పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. ఎస్సారెస్పీ మరమ్మతుల పనులు వేగవంతంగా సాగుతున్నాయని ఆయన అన్నారు.ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హరీశ్ రావు అన్నారు. పాకాల సరస్సు లోకి గోదావరి జలాలను త్వరగా తెప్పించడానికి పనులను వేగవంతం చేయించినట్ట్టు మంత్రి  హరీష్ రావు తెలిపారు.నర్సంపేట నియోజకవర్గం లక్ష ఎకరాల సాగు దిశగా అడుగులు వేస్తున్నాదని హరీశ్ రావు అన్నారు. నర్సంపేట నియోజకవర్గాన్ని ‘ఇరిగేషన్ సర్క్యూట్’ చేయడంలో భాగంగా సుమారు 336 కోట్ల రూపాయలతో మొదలైన భారీ నీటి ప్రాజెక్టు   రామప్ప – పాఖాల లింకు పనులను ఆయన పరిశీలించారు. రామప్ప నీళ్ళతో పాకాల పరిసరాల్లో రైతుల పొలాలు తడుపుతామని మంత్రి చెప్పారు. ఎన్నో ఏళ్ల కలను సీఎం సాకారం చేశారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు అయినందున రైతుల ప్రయోజనాలే లక్ష్యం గా పని చేస్తున్నట్టు హరీశ్‌ చెప్పారు. రామప్ప,పాకాల లింక్‌ పూర్తి అయితే 45 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. పెద్ది సుదర్శన్‌ రెడ్డి పట్టుదల వల్లనే ఈ పథకం మంజూరైందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.తెలంగాణ సోయితోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు రీ డిజైన్, రీ ఇంజనీరింగ్ చేసినట్టు మంత్రి హరీశ్‌రావు తెలియజేశారు. భవిష్యత్‌లో దేశానికి అన్నంపెట్టే భాండాగారంగా తెలంగాణ మారుతుందని ఆయన చెప్పారు. నీటి ప్రాజెక్టులను కట్టడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.  రైతుల ఆత్మహత్యలను నివారించాలని, ప్రతి నియోజ కవర్గానికి సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన  పూర్తి చేస్తున్నామని ఆయన  తెలిపారు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారని మంత్రి అన్నారు. తుపాకుల గూడెం నుంచి శ్రీరాం సాగర్ వరకు 270 కిలోమీటర్ల మేరకు గోదావరి నది ఏడాది పొడవునా 365 రోజులపాటు సజీవంగా ఉంటుందన్నారు. మహారాష్ర్ట నుంచి సముద్రం వరకు నౌకాయానం జరుగుతుందన్నారు. మత్స్య పరిశ్రమ, టూరిజం అభివృద్ధి చెందుతుందని హరీశ్ రావు తెలిపారు. గతంలో ప్రాణహిత-చేవెళ్ల పథకం కింద 16 లక్షల ఎకరాలకే ఆయకట్టును ప్రతిపాదించారని రీ డిజైన్, రీ ఇంజనీరింగ్ అనంతరం 37 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి లభించనుందని ఇరిగేషన్ మంత్రి గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్ళ పథకంలో 11 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు ప్రతిపాదించగా 147 టీఎంసీలకు వాటి సామర్ధ్యాన్ని  కేసిఆర్ పెంచారని హరీశ్ రావు తెలియజేశారు. ఈ  ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను నిర్మించి ఎత్తిపోతల ద్వారా మల్లన్న సాగర్, కొండపోచమ్మ, గంధమల్ల తదితర రిజర్వా యర్లను నిర్మించి తెలంగాణలోని అత్యంత కరువుపీడిత ప్రాంతాలలోని సుమారు 37 లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వ్యూహాత్మక వైఖరితో అంతర్రాష్ర్ట అనుమతులు, జలసం ఘం అనుమతులు సాధించుకోగలిగినట్టు హరీశ్ రావు వివరించారు.కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాం మీదుగా హుజురాబాద్,పరకాల, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల ఆయకట్టుకు నీరందుతుందని హరీశ్ రావు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కింద 9 లక్షల  ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల  కొన్ని నియోజకవర్గాలకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి చుక్క నీరు కూడా వెళ్ళలేదన్నారు. ఎల్.ఎం.డి.దిగువన 5.40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ కాలువలు శిధిలమై పూర్తి ఆయకట్టుకు నీరందలేదని హరీశ్ రావు విమర్శించారు. 1070 కోట్ల వ్యయంతో చేపట్టిన శ్రీరామ్ సాగర్ ఆధునీకరణ పనుల వల్ల పూర్తి ఆయకట్టుకు నీరందనుందని అన్నారు. శ్రీరామ్‌సాగర్ రెండోదశ కింద చేపట్టిన పనుల వల్ల పాలకుర్తి నియోజకవర్గంలో రైతులకు సాగునీరు లభిస్తుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి అటు దేవాదుల నుంచి కూడా సాగు నీరు వస్తుందన్నారు.  తెలంగాణ రాష్ట్ర  సమితి ఏర్పడిన తర్వాత సాగునీటిరంగంలో దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలను కేసీఆర్ ప్రశ్నించడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని  ఆయన గుర్తు చేశారు.  కంతనపెల్లి బ్యారేజీకి 2009 ఎన్నికలకు ముందు శంకుస్థాపన  చేసినా తట్టెడు మన్ను తీయలేదని విమర్శించారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని రామప్ప చారిత్రాత్మక దేవాలయానికి ప్రమాదం కలుగకుండా పైప్ద్ ఇరిగేషన్ విధానంతో పనులు చేపట్టామని చెప్పారు. ములుగు, భూపాలపల్లి, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్యాప్ ఆయకట్టుకు నీరందిస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల 9 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీటిని అందిస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. త్వరలోనే తెలంగాణ మరో కోనసీమ కానుందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర  ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. వందేళ్ళ తర్వాత కూడా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకునే విధంగా సాగునీటి రంగంలో పనులు  సాగుతున్నట్టు హరీశ్ రావు తెలియజేశారు. కాళేశ్వరం లింక్ 1 లో మూడు బ్యారేజీ లు,మూడు పంప్ హౌస్‌లను అతి తక్కువ వ్యవధిలో 20 నెలల్లోనే పూర్తి చేస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి తెలిపారు. కాళేశ్వరం పనులు మూడు షిఫ్టులలో వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే దాదాపు 70 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. తెలంగాణను ఆకుపచ్చని తెలంగాణగా, కోటి ఎకరాల మాగాణిగా మార్చడం సీఎం సంకల్పం అని మంత్రి తెలిపారు. తుపాకులగూడెం ప్రాజెక్టు, ఎస్.ఆర్.ఎస్.పి స్టేజ్-2 పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఎస్.ఆర్.ఎస్.పి. స్టేజ్-2 నుంచి పూర్వ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కరవు పీడిత ప్రాంతాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరందించే పనులు మరింత వేగవంతం చేయాలని హరీశ్ రావు కోరారు. ఎస్.ఆర్.ఎస్.పి స్టేజ్-2 పరిధిలో 2 లక్షల 25 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిందని చెప్పారు. మరో లక్షా 75 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ పథకం కింద 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉందన్నారు. పూర్వ నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో  2,13,175 ఎకరాలకు, ఖమ్మం జిల్లాలో పాలేరు, మధిర అసెంబ్లీ నియోజకవర్గాలలో 75, 262 ఎకరాలకు, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్ నియోజకవర్గాలలో 1,09,512 ఎకరాలకు సాగునీరందుతుందని మంత్రి గుర్తు చేశారు. శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని హరీశ్ రావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎస్.ఆర్.ఎస్.పి. స్టేజ్-2 కింద సాగునీరందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని హరీశ్ రావు చెప్పారు.అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి చందూలాల్,పౌరసరఫరాల కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ,టి.రవీందర్ రావు తదితర నాయకులు మంత్రి వెంట పర్యటనలో ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *