భూదానంపై కేసీఆర్ పట్టు.. విడవని ఉస్మానియా జట్టు..

OU Tension

స్వచ్ఛ హైదరాబాద్ సీఎం కేసీఆర్ పేదలకు ఇస్తున్న వరాలు కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. సీఎం పేదల కోసం ఖాళీగా ఉన్న యూనివర్సిటీల భూములను ఇస్తానని ప్రకటించడం వివాదానికి దారితీసింది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఖాళీ స్థలాన్ని హైదరాబాద్ లోని నిరుపేదలకు ఇచ్చి, అక్కడ ఇళ్లు కట్టిస్తానని చెప్పడం గందరగోళానికి దారితీసింది.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకరిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆందోళలను తెరతీశారు. యూనివర్సిటీలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం ఉస్మానియా భూములను పేదలకు ఇస్తే ఊరుకోమని.. అవసరముంటే ఆయన ఫాంహౌజ్ భూములిచ్చుకోవచ్చని నినదించారు. సీఎంకు భూపిచ్చిపట్టిందని విద్యార్థులు ఆందోళనలు చేశారు.

కాగా సీఎం కేసీఆర్ దీనిపై దీటుగా స్పందించారు. కొత్తమంది పోరగాళ్ల మాటలకు భయపడేది లేదని.. దిమాక్ లేని వాల్లే ఇలా లొల్లి చేస్తారని.. యూనివర్సిటీల భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని స్పష్టం చేశాడు. దీంతో సీఎం కేసీఆర్ కు.. ఉస్మానియా విద్యార్థులకు మధ్య లొల్లి ముదిరింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *