భీంగల్, మోర్తాడ్, బాల్కొండ లో ఇంట్రా విలేజ్ వర్క్స్ ను ప్రారంభించిన ప్రశాంత్ రెడ్డి

ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారి సంకల్పాన్ని యావత్ దేశం
అభినందిస్తుందన్నారు మిషన్ భగీరథ వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ఆడపడుచుల దశాబ్దాల గోసను
శాశ్వతంగా తీర్చేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్,
మోర్తాడ్, బాల్కొండ లో ఇంట్రా విలేజ్ వర్క్స్ ను ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ముందుగాల భీంగల్ మండల
కేంద్రంలో 41.3 లక్షల నిధులతో నిర్మించబోయే ఐదు 120 KL OHSR లకు శంఖుస్థాపన చేశారు. ఆ తర్వాత
మోర్తాడ్ మండల కేంద్రంలో 35 లక్షల నిధులతో నిర్మించే ఒక 90 KL OHSR తో పాటు, మూడు 60 KL OHSR
లకు, బాల్కొండ మండల కేంద్రంలో 42.7 లక్షల రూపాయల నిధులతో నిర్మించే ఆరు 90KL OHSR లకు భూమి
పూజ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇంట్రావిలేజ్ వర్క్స్ మొదలయ్యాయని, ఈ డిసెంబర్ చివరి నాటికి ప్రతీ
ఆవాసానికి సురక్షిత మంచినీటిని అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు
మిషన్ భగీరథ, RWS&S అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *