
గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ కు రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ దంపతులు బేగంపేట విమానాశ్రయంలో ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. రెండు రోజుల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ, కడియం శ్రీహరి, రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ప్రజా ప్రతినిథులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.