భార‌త్‌లో పెరుగుతున్న స్వ‌ల్ప వ్య‌వ‌ధి చికిత్సా విధానం.. ఖ‌ర్చు త‌క్కువ – ఫ‌లితం ఎక్కువ

హైద‌రాబాద్ః- ఇంత‌వ‌ర‌కు అమెరికా,ఇంగ్లండ్ వంటి పాశ్చాత్య దేశాల‌కే ప‌రిమిత‌మైన స్వ‌ల్ప వ్య‌వ‌ధి చికిత్సావిధానం ఇప్పుడు భార‌త్‌లో ప్రాచుర్యం పొందుతోంది. 23 గంట‌ల చికిత్స లేదా డే కేర్ స‌ర్జ‌రీ లేదా షార్ట్ స్టే స‌ర్జ‌రీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ ఆధునిక చికిత్సా ప‌ద్ధ‌తి తాజాగా హైద‌రాబాద్‌లో విస్త‌రిస్తోంది. దీనివ‌ల్ల ఇటు రోగికి అయ్యే ఖ‌ర్చు అత్య‌ధిక‌శాతం త‌గ్గిపోవ‌డమేగాక‌, ఆస్పత్రిలో చేరిన 23 గంట‌ల్లోగా తిరిగి ఇంటికి సంపూర్ణ ఆరోగ్యంతో వెళ్లిపోయే పరిస్థితి క‌నిపిస్తుంది. ఎముక‌లు, కీళ్లు,భుజాలు,హెర్నియో,హైడ్రోసెల్‌,క‌న్ను, వెన్ను, ర‌క్త‌నాళాలు త‌దిత‌ర విభాగాల‌తోపాటు కీల‌క‌మైన పెద్ద‌పేగు ఆప‌రేష‌న్లు కూడా త‌క్కువ వ్య‌వ‌ధిలోనే పూర్తిచేసి ఇంటికి పంపించేలా ఆధునిక విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో ప్ర‌ధానంగా ఖర్చు, మత్తు మందు వినియోగాలు త‌క్కువ‌గానే ఉంటాయి. అన్ని వ‌య‌సుల వారికి ఉప‌యుక్తంగా ముందే రోగి గురించి వివ‌రాల విశ్లేష‌ణ జ‌రుగుతుంది. ప‌రిమిత మందుల వినియోగంతోపాటు రోగిని త్వ‌ర‌గా ఇంటికి పంపిస్తూ, వారికిగాని, లేదా బంధువుల‌కుగాని స‌ర్జ‌రీ అనంత‌రం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను ఆస్ప‌త్రి వైద్యులు వివ‌రిస్తారు. ప‌లితంగా రోగికి ఇంటివ‌ద్దే విశ్రాంతి తీసుకునే సౌల‌భ్యం, బంధువుల‌కు సుల‌భ‌త‌ర‌మైన ప‌రామ‌ర్శ వంటి సౌక‌ర్యాలు క‌లుగుతాయి. అంతేగాక ఆస్ప‌త్రుల‌లో ప్ర‌ధాన‌మైన ఇన్ఫెక్ష‌న్‌లు సోకే ప్ర‌మాదమూ త‌ప్పుతుంది. రోగి వ్య‌క్తిగ‌త జీవితానికి భంగం క‌ల‌గ‌ని ఈ చికిత్సా విధానం వ‌ల్ల ప్రైవేటు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో బెడ్స్ దొర‌క‌ని స‌మ‌స్య ఉత్ప‌న్నం కాదు.1970లో అమెరికాలో ఇద్ద‌రు వైద్యులు ప్ర‌యోగాత్మ‌కంగా రోగుల‌కు త‌క్కువ వ్య‌వ‌ధిలో స‌ర్జ‌రీ చేసే పరిస్ధితుల‌ను క‌ల్పించి, ఫ‌లితాల‌ను సాధించడంతో 1980-90ల మ‌ధ్య అమెరికా, ఇంగ్లండ్ త‌దిత‌ర దేశాల‌లో ఈ విధానం రోగుల‌ను ఆకర్షించింది. ఫ‌లితంగా అమెరికాలో 30 శాతం, ఇంగ్లండ్‌లో 40 శాతం ప్ర‌జ‌లు డే కేర్ స‌ర్జ‌రీల‌వైపు మ‌క్కువ చూపారు. భార‌త‌దేశంలో ఒక రోగికి,రోజుకు బెడ్ ప‌రంగా రూ.800 నుంచి 900 వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా వేశారు. మ‌రికొన్ని చోట్ల ఇది మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిర్ధారించారు. అదే ఒక రోగి రోజుల త‌ర‌బ‌డి ఆస్ప‌త్రిలో ఉంటే ఖ‌ర్చు పెరుగుతుంది. అందువ‌ల్ల ముందుగానే రోగి ప‌రిస్ధితిని, ఆప‌రేష‌న్ అవ‌స‌రాన్ని గుర్తించి, పూర్తిస్ధాయిలో చికిత్సా ప్ర‌మాణాలు, ప‌రిక‌రాలు క‌లిగిన ఆస్ప‌త్రులు వెంట‌నే గంట‌ల వ్య‌వ‌ధిలో చికిత్స‌ను పూర్తిచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆస్ప‌త్రులు ముందుగానే ఆప‌రేష‌న్ ఎలాంటిదైనా,పూర్తిస్ధాయి స‌మాచారం, స‌ర్జ‌రీకి సంసిద్ధ‌త‌తో స‌హా రోగి అనుమ‌తితో చికిత్స‌ను త్వ‌రితంగా పూర్తిచేసి ఇంటికి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. రోగికి బీపీ, మ‌ధుమేహం, మ‌ద్య‌పాన వ్య‌స‌నం వంటి అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని 24-48 గంట‌ల మ‌ధ్య పూర్తిస్దాయి ప‌రిశీల‌న ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డుతున్నాయి. దీనికోసం శిక్ష‌ణ పొందిన సిబ్బందిని సిద్ధం చేస్తున్నాయి.అంతేగాక డేకేర్ స‌ర్జ‌రీల వ‌ల్ల సిబ్బందితో ఇబ్బందులు, రాత్రివేళ‌ల్లో ఎక్కువ సిబ్బంది వినియోగం కూడా త‌గ్గుతుంద‌ని తేలింది. ఆస్ప‌త్రుల‌కూ అన‌వ‌స‌ర వ్య‌యం, త‌ల‌నొప్పులు త‌గ్గేలా ఈ చికిత్సా విధానం ఉప‌యుక్త‌మ‌వుతుంది.హైద‌రాబాద్‌లో కొన్ని ప్ర‌ముఖ‌, పూర్తిస్ధాయి చికిత్సా పరిక‌రాలు,ప్ర‌మాణాలు క‌లిగిన ఆస్ప‌త్రుల‌లో ఈ విధానం అమ‌లులోకి వ‌స్తోంద‌ని ఎవిస్ ఆస్ప‌త్రి నిర్వాహ‌కులు, ప్ర‌ముఖ కేన్స‌ర్‌, ర‌క్త‌నాళాలు, స్ర్తీల వ్యాధినిపుణులు డాక్ట‌ర్ రాజా.వి.కొప్ప‌ల తెలిపారు. హైద‌రాబాద్‌లో తాము ఈ చికిత్సా విధానాన్ని అమ‌లు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. రోగులు స‌ర్జ‌రీకి 3 గంట‌ల ముందుగా నీరు తాగ‌వ‌చ్చున‌ని, ఉబ్బ‌స‌రోగులు ఇన్‌హేల‌ర్ వాడ‌కం, మ‌ధుమేహ రోగులు ఇన్సులిన్ వాడిన‌ప్ప‌టికీ ఈ స‌ర్జ‌రీల‌కు ఆటంకం ఉండ‌ద‌ని ఆయ‌న వివ‌రించారు. ఇంగ్లండ్‌లో 2006-08 మ‌ధ్య 327 మందికి ఆప‌రేష‌న్లు నిర్వ‌హించ‌గా 94 శాతం పూర్తిస్ధాయిలో సంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు ఓ స‌ర్వేలో తేలింది. ది రాయ‌ల్ కాలేజ్ ఆఫ్ స‌ర్జ‌రీ- ఇంగ్లండ్ వారి అంచ‌నా ప్ర‌కారం ఇటువంటి చికిత్సా విధానం మ‌రింత విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డాక్ట‌ర్ రాజా తెలిపారు. హైద‌రాబాద్‌లో విస్త‌రిస్తున్న ఈ డేకేర్ స‌ర్జ‌రీ విధానానికి సంబంధించి త‌గు స‌ల‌హాలు,సూచ‌నలు అందించనున్న‌ట్లు ఆయ‌న సంసిద్ధ‌త తెలిపారు. ఇత‌ర వివ‌రాల‌కు 9989527715 లేదా 9908677715 నెంబ‌ర్ల‌లో సంప్ర‌దించాల‌ని డాక్ట‌ర్ రాజా సూచించారు. పెరుగుతున్న జనాభా, రోగుల సంఖ్య‌, చాలీచాల‌ని ఆస్ప‌త్రుల సంఖ్య‌ను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో ఈ నూత‌న చికిత్సా విధానాన్ని అమలుచేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని డాక్ట‌ర్ రాజా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన‌వారు న‌గ‌రాల్లో లేదా చిన్న‌పాటి ప‌ట్ట‌ణాల్లో ఏర్పాట‌య్యే డే కేర్ స‌ర్జ‌రీ హాస్పిట‌ల్స్ ద్వారా సౌక‌ర్యం పొంద‌వచ్చున‌ని ఆయ‌న చెప్పారు.

—డాక్ట‌ర్ రాజా,ఎవిస్ హాస్పిట‌ల్స్‌, హైద‌రాబాద్‌, 9908677715

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *