భార్య బాటలోనే భర్త.. స్టిక్ట్ ఆఫీసర్ కథ..

హైదరాబాద్ : అకున్ సభర్వాల్.. ఐపీఎస్ .. ఈయన పేరు తెలియక పోవచ్చు కానీ.. స్మిత సభర్వాల్ అందరికీ గుర్తే.. ఈమె ప్రస్తుతం సీఎం కార్యాలయం  కార్యదర్శి గా తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. సీఎం నిర్ణయాలను చాలా తొందరగా అమలు కావడంతో ఈమె పనితనం ప్రఖ్యాతి గాంచింది. స్మిత భర్తే అకున్ సభర్వాల్.

ఇన్నాళ్లు హైదరాబాద్ లోని నేషనల్ అకాడమీలో పనిచేసిన ఈ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి అకున్ సభర్వాల్.. నిన్న తెలంగాణ ఔషధ నియంత్రణ డైరెక్టర్ జనరల్  గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే  ఇటీవల కార్పొరేట్ ఆస్పత్రుల్లో అక్రమాలు జరిగాయంటూ తెలియడంతో వాటిపై దాడులకు ఆదేశించారు. ఉపసంచలాకులు పర్యవేక్షణలో 11 బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

హైదరాబాద్ లోని పేరున్న ప్రతి ఆసుపత్రిలో తనిఖీలుచేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.  ఆరు ఆస్పత్రుల్లో మందుల దుకాణాలు అక్రమంగా వినియోగిస్తున్నట్టు తేలింది. మందుల కొనుగోళ్లు, నిర్వహణ, ఎక్స్ పైరీ డేట్ తో ఉన్న మందులను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న  9 కార్పొరేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు.

మొత్తానికి తెలంగాణలో ఐఏఎస్ స్మిత, ఆమె భర్త ఐపీఎస్ అకున్ సభర్వాలు ఇద్దరు స్ట్రిక్ట్ ఆఫీసర్లే నని తేలింది. ముక్కుసూటి తనమే వీరి నైజం. అక్రమాలపై ఉవ్వెత్తున లేవడమే వీరి పని.. దీని వల్లవీరికి.. ప్రభుత్వానికి మంచి పేరే దక్కుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *