భార్గవ్ కు సిఎమ్ రిలీఫ్ ఫండ్ అందజేసిన తలసాని..

భార్గవ్ కు సిఎమ్ రిలీఫ్ ఫండ్ అందజేసిన తలసాని..

బేగంపేట డివిజన్ ప్రకాశ్ నగర్ కు చెందిన చిరంజీవి భార్గవ్ సంజిత్ కు ముఖ్యమంత్రి సహయ నిధి నుండి మంజూరు చేసిన 2 లక్షల రూపాయల (loc)ని మారేడ్ పల్లిలోని తన నివాసంలో రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఇటీవలనే బేగంపేట డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేసి ఆదివారం నాడు టి.ఆర్.ఎస్.పార్టీలో చేరారు. తన మనవడికి కేవలం 3 సంత్సరాల వయస్సులోనే భార్గవ్ సంజిత్ బ్లడ్ క్యాన్సెర్ తో బాధపడుతున్నారని దాని వైద్యానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని ఆయన మంత్రికి మొరపెట్టుకున్నారు. విషయంపై వెంటనే స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా వైద్యానికి అయ్యే ఖర్చులో 2 లక్షల రూపాయల ఆర్ధిక సహయాన్ని మంజూరు చేయించారు. ఈ మంజూరి పత్రాన్ని మంగళవారం తన నివాసంలో వారి భార్గవ్ సంజిత్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బేగంపేట కార్పోరేటర్ తరుణి, మాజీ కార్పోరేటర్లు మహేశ్వరి, నరేందర్, శ్రీహరి, ప్రవీణ్ రెడ్డి, గోపాలాల్ చౌహన్, రామ్ గోపాల్ పేట మాజీ కార్పోరేటర్ కిరణ్మయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *