భారీ విగ్రహాలు తయారు చేసే ఏరోసన్ ఇంజనీరింగ్ కంపెనీని సందర్శించిన అంబేద్కర్ విగ్రహ కమిటీ

• అంబేద్కర్ విగ్రహ రూపకల్పనలో ఏరోసన్ కంపెనీ సహకారంపై సమావేశం
• విగ్రహాల తయారీ విధానాన్ని పరిశీలించిన కమిటీ సభ్యులు
• చైనా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించిన విద్యాశాఖ మంత్రి, కమిటీ సభ్యులు

భారీ విగ్రహాల అధ్యయనం కోసం చైనాలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో పర్యటిస్తున్న అంబేద్కర్ విగ్రహ కమిటీ నేడు (శుక్రవారం) నాన్జింగ్ లోని ఏరోసన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ను సందర్శించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేష్, అధికారులు ఈ కంపెనీని సందర్శించి యాజమాన్యంతో సమావేశమయ్యారు. భారీ విగ్రహాలు, వాహనాలు తయారు చేసే ఈ కంపెనీ కన్ స్ట్రక్షన్ మెషీనరీ, హెవీ మైనింగ్ , క్యాస్టింగ్, ఫోర్జింగ్ లలో సుప్రసిద్ధమైంది.

తెలంగాణలో అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని తయారు చేయడానికి ఈ కంపెనీ నుంచి తీసుకోవాల్సిన సహకారంపై కంపెనీ యాజమాన్యంతో చర్చించారు. నాన్జింగ్ లో ఉన్న ఈ కంపెనీ భారీ విగ్రహాలు తయారు చేయడంలో వారికున్న అనుభవాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అంబేద్కర్ విగ్రహ కమిటీకి వివరించారు. అనంతరం ఏరోసన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ లో మెకానిక్ షెడ్ లో తిరిగి తయారీ విధానాలను తెలుసుకున్నారు.

చైనా ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ మంత్రి కడియం
ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైనా వెళ్లి అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఉప ముఖ్యమంత్రితో పాటు అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు కూడా ఆ పాఠశాలకు వెళ్లి అక్కడ బోధన పద్దతులు, సమకూర్చుతున్న వసతులు, మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలతో సెల్ఫీలు తీసుకున్నారు.

chaina-2 (1)chaina-3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *