భారీ పరిశ్రమలుపై జీఎస్టీ ప్రభావం ఎంత …. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చ

 

 

భారీ పరిశ్రమలపైన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశం అయింది. ఈ సమావేశంలో జియస్టీ నేపథ్యంలో మారిన పరిస్థితుల మీద చర్చించారు. పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, అర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ల అధ్యర్యంలో జరిగిన ఈ సమావేశంలో అర్ధిక, సెల్స్ టాక్స్, పరిశ్రమలు, రెవెన్యూ వంటి వివిధ శాఖాధిపతులు ఈ సమావేశానికి హజరయ్యారు. ఈ సమావేశంలో జియస్టీ నేపథ్యంలో రాష్ర్టంలోని పరిశ్రమల రాయితీలను, వాటిపైన పడనునున్న ప్రభావం వంటి అంశాలను చర్చించారు.

వచ్చే మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం నాటికి జియస్టీ రాబడులు, వాటి ప్రభావం వంటి అంశాల అధ్యయనానికి దేశంలోని అత్యుత్తమ  కన్సల్టెంట్స్ కంపెనీ సేవలు ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కన్సల్టెంట్స్ ఇచ్చే నివేధిక అధారంగా జియస్టీ ప్రభావం పైన సరైన అవగాణకు వీలవుతుందని మంత్రులు తెలిపారు. ఈ నివేదిక అనంతరం ముఖ్యమంత్రి  వివిధ అంశాల మీద ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ సమావేశానికి హజరయిన సిఐఐ ప్రతినిధుల బృందం సైతం జియస్టీపైన వివిధ రాష్ర్టాలు చేపడుతున్న చర్యలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలపైన రెండు వారాల్లో  ఒక నివేదికను ఇస్తామని మంత్రులకు తెలిపారు. పలు భారీ పరిశ్రమలకు రాయితీలపైన పలు నిర్ణయాలను తీసుకున్నది.

EODB(Ease of Doing Business) పైన విస్తృతస్ధాయి సమావేశం

EODB(Ease of Doing Business) పైన మంత్రి కెటి రామారావు విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించారు. పలు శాఖల అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో EODBలో మరోసారి అగ్రస్థాయిలో నిలిచేందుకు అన్ని శాఖల అధికారులు అవసరమైన చర్యలను తీసుకోవాలని అధికారులను మంత్రి అదేశించారు. గత సంత్సరంలో ఇబ్బందులు ఏదుర్కోన్న పలు శాఖల అధికారులు ఈసారి మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. EODBలో మంచి ర్యాంకు కోసం  తీసుకుంటున్న చర్యలు, మార్పులు క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా శాఖాల్లోని సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. కేవలం కాగితాలమైన మార్పులకు మాత్రమే కాకుండా నిజమైన  EODB పరిస్ధితులను కల్పించడమే లక్ష్యంగా గత ఏడాది నుంచి పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటిదాకా 108 అంశాల్లో మార్పులు అవసరం అవుతాయని అధికారులు తెలిపారు. ఇవన్నింటిని వేంటనే పూర్తయ్యేలా చూడాలని మంత్రి అదేశాలు జారీ చేశారు. సమావేశంలో మంత్రి శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అంశాలపైన సమీక్ష నిర్వహించారు.

గనుల శాఖ మీద మంత్రి కెటి రామారావు సమీక్ష

గనుల శాఖ మీద మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. HMDA పరిధిలోని పలు గనుల లీజు పునరుద్దణపైన చర్చించారు. దీంతోపాటు రాష్ర్ట వ్యాప్తంగా కేటాయింపులు జరిగిన తర్వతా కూడా ఇప్పటి దాకా కార్యకలాపాలు ప్రారంభించని వాటికి నోటీసులు ఇచ్చి, వాటి లీజులు రద్దు చేసే కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. కార్యాకలాపాలు  నిర్వహిస్తున్నప్పటి, నీర్ణీత గడువులోగా లక్ష్యాలు చేరుకోని వారీకి జరిమానాలు విధించాలన్నారు. ఖనిజాల తవ్వకాల నుంచి ఖజానాకు వస్తున్న రెవెన్యూను పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి దాకా రాష్ర్టంలో లీజుకిచ్చిన లైమ్ స్టోన్ లీజుదారుల రిసోర్స్ అడిటింగ్ జరిపాలని, అవసరానికి మించి లీజులు తీసుకున్న వారి నుంచి అయా గనులను వెనక్కి తీసుకోవాలన్నారు.

About The Author

Related posts