భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

భారత రాష్ట్రపతి  రాంనాథ్ కోవింద్ తో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

బాలికల విద్యా శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని భారత రాష్ట్రపతి

రాంనాథ్ కోవింద్ కు వివరించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

శుక్రవారం భారత రాష్ట్రపతి  రాంనాథ్ కోవింద్ తో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి

కడియం శ్రీహరి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ భేటిలో భాగంగా బాలికల విద్యాభివృద్ధి లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిని భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్  కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా బాలికల డ్రాపవుట్లు అధికంగా ఉండేవని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి  కే. చంద్రశేఖర్ రావు బాలికల డ్రాపవుట్లపై ప్రత్యేక సర్వే నిర్వహించారని రాష్ట్రపతి కి వివరిoచారు. ఈ దిశలోనే ప్రాథమిక స్థాయి నుంచి, ఉన్నత విద్యనభ్యసించే దిశలో బాలికల డ్రాపవుట్లు పెరుగుతున్నాయని గమనించినట్లు రాష్ట్రపతి కి వివరించాలని కడియం శ్రీహరి తెలిపారు. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 470 గురుకుల పాఠశాలలను ప్రారంభించామని రాష్ట్రపతి కి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం 53 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను   ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ కు వివరించినట్లు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దేశ వ్యాప్తంగా విద్యాభివృద్ధి, బాలికల విద్యా వ్యాప్తి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఈ సందర్భంగా రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బాలికల విద్యపై దృష్టిపెట్టాల్సి ఉందని రాష్ట్రపతి సూచించారని ఉప ముఖ్యమంత్రి అన్నారు. పాఠశాలల్లో, కాలేజీల్లో బాలికల ఎన్‌రోల్‌మెంట్ పెంచాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఈ సందర్భంగా రాష్ట్రపతి గుర్తు చేశారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. భారత రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు, మహబూబాబాద్‌ పార్లమెంటు సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ లు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *