
శీతాకాల విడిదికి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు విచ్చేసిన భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కు హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, లేడీ గవర్నర్ శ్రీమతి విమలా నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు లు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి అనంతరం బొల్లారం లోని రాష్ట్రపతి నిలయంకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి డిసెంబర్ 27 వ తేదీ వరకు బస చేస్తారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ, శ్రీ కడియం శ్రీహరి, రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ శ్రీ కే. స్వామి గౌడ్, శాసన సభ స్పీకర్ శ్రీ మధుసూధనాచారి, క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.