భారత్ వన్డే మ్యాచ్ పై పటేళ్ల కన్ను

రాజ్ కోట్ : గుజరాత్ లో హార్దిక్ పటేల్ నాయకత్వంలోని పటేల్ సామాజికవర్గాల ఉద్యమం తారాస్థాయికి చేరింది.పటేలు నేడు రాజ్ కోట్ లో జరుగనున్న భారత్ దక్షిణాప్రికా వన్డేపై దృష్టిసారించారు. ఇప్పటికే దాదాపు 50వేల మంది పటేల్ ఉద్యమకారులు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలియడంతో పోలీసులు, సౌరాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ పటిష్ట భద్రత పెంచింది..

రాజ్ కోట్ లో ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ పై నిషేధం విధించారు. స్టేడియంలో నిఘా కోసం డ్రోన్ కెమెరాలు సిద్దం చేశారు. తనతోపాటు 50వేల మంది ఉద్యమకారులు మ్యాచ్ టికెట్లు పొందామని హార్దిక్ పటేల్ చెప్పారు.స్టేడియంలోకి అనుమతించకపోతే మరో రూపంలో ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *