
యోగా గురువు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ‘భారత్ మాతాకీ జై అనబోమన్న వారిని లక్షల్లో నరికేసి ఉండేవాన్ని .. కానీ భారత రాజ్యాంగంపై గౌరవం ఉంది కాబట్టే ఆ పనిచేయకుండా ఊరుకున్నానని’ బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని రోహతక్ లో నిర్వహించిన ‘సద్భావన సమ్మేళన్’ లో ఆయన పాల్గొని మాట్లాడారు.
భారత్ మాతాకీ జై అనని అన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపైనే ఆయన కౌంటర్ ఇచ్చాడు.. ‘నెత్తిన టోపీ పెట్టుకొని తల తెగినా భారత్ మాతాకీ జై అనను అంటే ఒక్కడినేమిటీ లక్షల మంది తలలు తీయగలం అంటూ ఆవేశంగా మాట్లాడారు బాబా..