
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగనున్నాయి.. అందులో భాగంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అప్పుడే అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. రిపబ్లికన్ల తరఫున బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఆదినుంచి ప్రచారంలో కాంట్రవర్సీతో అమెరికా ప్రజల ఆదరాభిమానాలను చూడగొంటున్నారు. మొన్ననే ముస్లింలను దేశంలోకి అనుమతించ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ , చైనా, బ్రెజిల్ దేశాలపై తన అక్కసు వెళ్లగక్కాడు.. ఇక నిన్న సీఎన్ఎన్ ఇంటర్వ్యూల్లో మాత్రం భారత్ పై తన ప్రేమను కనబరిచాడు..
భారత్ ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతున్న దేశమని.. కానీ ఎవరూ ఆ దేశాన్ని, గొప్పతనాన్ని గుర్తించడం లేదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అన్ని దేశాలను తిట్టిన ట్రంప్ భారత్ ను పొగడడంపై అమెరికాలో ఉన్న భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. భారత్ సంబంధాలను మెరుగుపరుస్తుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.