భారత్ ను గెలిపించిన ధోని

01dhoni

-వెస్టిండీస్ పై విజయంతో క్వార్టర్స్ చేరిన భారత్
పెర్త్ : ప్రపంచకప్ లో భారత్ తొలిసారి తడబడింది. ఇన్నాళ్లు తలపడిన ప్రతి జట్టుపై ఆధిపత్యం చెలాయించిన భారత్ కు వెస్టిండీస్ గట్టి పోటీ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో భారత్ చాలా కష్టపడి గెలిచింది. వరుసగా నాలుగో విజయంతో క్వార్టర్స్ బెర్త్ ను ఖాయం చేసుకుంది.

శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది. భారత టాప్ ఆర్డర్ విఫలమైన వేళ ఫామ్ లో లేని కెప్టెన్ ధోని (45) పరుగులు చేసి క్లిష్ట సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్ ను గెలిపించాడు.

మొదట భారత బౌలర్ల ధాటి వెస్టిండీస్ 44.2 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విండీస్ జట్టులో కెప్టెన్ హోల్డర్ (57) మాత్రమే రాణించాడు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ త్వరగా ఔటవడంతో ఆందోళన నెలకొంది. కానీ కెప్టెన్ ధోని రైనా, జడేజా అశ్విన్ లతో కలిసి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు.

ఈ గెలుపుతో ధోని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. విదేశాల్లో భారత్ కు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు గంగూలి(59) పేరిట ఉంది. దాన్ని ధోని అధిగమించాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *