
వాజ్ పేయి ఈరోజు భారత రత్నను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధానం చేయనున్నారు. కానీ దాన్ని తీసుకొని.. దాని ఫలితాన్ని తనివితీరా అనుభవించే స్థితిలో ఆయన లేరు.. ఆయన న్యూమోనియా, వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు.
వాజ్ పేయి (91) ఏళ్లు.. ఆయనకు ఈరోజు భారత రాష్ట్రపతి ఆయన నివాసానికి వెళ్లి భారత రత్నను ప్రధానం చేయనున్నారు. కానీ ఆయన రాష్ట్రపతిని కూడా గుర్తుపట్టడం కష్టమే.. సహాయకుల సాయంతో ఆయన కదలడం చేస్తున్నారు. ఆయన ఒంటిని కూడా వారే శుభ్రం చేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ మాత్రమే వాజ్ పేయి బర్త్ డేనాడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. న్యూమోనియాతో ఆయన మెదడు మొద్దు బారిపోయింది. ఎవరిని గుర్తు పట్టలేడు. ఈ దుర్భర స్థితిలో దేశ అత్యున్నత పురస్కారం అందుకోనున్న వాజ్ పేయి బతికుండగానే అత్యున్నత పురస్కారం అందుకుంటున్న మొదటి మాజీ ప్రధాని.