Breaking News

భారతదేశం మొత్తం బాసర ఐఐఐటి వైపు చూసేలా అభివృద్ధి చేయాలి: విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

భారతదేశం మొత్తం బాసర ఐఐఐటి వైపు చూసేలా అభివృద్ధి చేయాలి: విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

బాసర ఐఐఐటి విద్యార్థులంటే ఏ కంపెనీ అయినా తీసుకునేలా వీరిని తీర్చిదిద్దాలి తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యను పటిష్టం చేస్తున్నాం…ప్రమాణాలు పెంచుతున్నాం. గతంలో 1,75,000 ఇంజనీరింగ్ సీట్లను 98,000 తీసుకొచ్చాం…ఇంకా నియంత్రిస్తాం. తెలంగాణ రాష్ట్రానికి 50వేల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే చాలు… జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తెలంగాణ విద్యార్థి పోటీపడేలా విద్యను తీర్చిదిద్దుతున్నాం. గతంలో విద్యను భ్రస్టు పట్టించిన వారు నేడు మాపై విమర్శలు చేయడం శోచనీయం. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యను భ్రష్టు పట్టించారని అనడం విడ్డూరంగా ఉంది. ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఒక వైపు అంటూ మరోవైపు అడ్డుకునే ప్రయత్నం చేసే నీచ రాజకీయాలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనే ప్రొఫెసర్ కోదండ రామ్ టిఆర్టిని వాయిదా వేయాలనే సభకు వెళ్తున్నట్లు సమాచారం ఉంది. టిఆర్టి కి పరీక్షల షెడ్యూల్ ఇచ్చాము. ఎన్. సి.టీ. ఈ నిబంధనల మేరకు పరీక్ష నిర్వహిస్తున్నాం.  కొంతమంది రాజకీయ కారణాల తో నిర్వహించే ఈ సభల వల్ల పరీక్షలు వాయిదా వేయం. నిర్ణయించినట్లు పరీక్షలు జరుగుతాయి.. విద్యార్థులు ఎవరి మాటలు విని మోసపోకుండా పరీక్షలకు ప్రిపేర్ కావాలని కోరుతున్నాను. 2008లో బాసర ఐఐఐటి ప్రారంభమైతే…రెగ్యులర్ నియామకాలు చేయలేదు యూనివర్శిటీలను బలోపేతం చేసేందుకు 2017-18 బడ్జెట్ లో సిఎం కేసిఆర్ 420 కోట్ల రూపాయలు కేటాయించారు. యూనివర్శిటీల్లో 1551 పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతినిచ్చారు…బాసర ఐఐఐటిలో వంద పోస్టులు భర్తీ అవుతాయి. ఐఐఐటి బాసరకు వచ్చే విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులు…వీరిని కొద్దిగా మెరుగుపరిస్తే అత్యున్నత స్థాయికి వెళ్తారు. నిబంధనల మేరకే యూనివర్సిటీల్లో  అధ్యాపకుల నియామకాలు ఉంటాయి. అధ్యాపకుల భర్తీపై పూర్తి స్వేచ్ఛ యూనివర్సిటీలకు ఉంది. వాటి స్వయం ప్రతిపత్తి లో మేము జోక్యం చేసుకోము. త్వరలోనే ఐఐఐటి బాసరకు పూర్తి స్థాయి వీసీ ని నియమిస్తాం. బాసర ఐఐఐటి బాసర స్నాతకోత్సవంలో విద్యార్థులకు డిగ్రీలు అందించిన ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

ఈకార్యక్రమంలో పాల్గొన్న బాసర ఐఐఐటి వీసీ ఏ. అశోక్(ఐఎఎస్), ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ఉదయ్ బి. దేశాయ్, యూనివర్శిటీ అధికారులు,ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు.

kadiyam srihari 1     kadiyam srihari 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *