భవిష్యత్తు అంతా వెబ్ మీడియాదే..

-పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ చానల్ ప్రారంభోత్సవంలో ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ కే. శ్రీనివాస్ రెడ్డి
హైదరబాద్, ప్రతినిధి : ఈ ఇంటర్నెట్ యుగంలో భవిష్యత్తు అంతా వెబ్ మీడియాదేనని ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ కే.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ చానల్ ప్రారంభోత్సవం పొలిటికల్ ఫ్యాక్టరీ సీఈవో, చీఫ్ ఎడిటర్ అయిలు రమేశ్ అధ్యక్షతన జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  కే.శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడారు. వెబ్ మీడియా  మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తుందని.. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా ఉండడం సాధ్యం కాదన్నారు. స్మార్ట్ ఫోన్ ల రాకతో ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్లకు ఆదరణ పెరిగిందని .. పొలిటికల్ ఫ్యాక్టరీ వంటి చానెల్ లకు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇన్నాళ్లు పాశ్యాత్య దేశాలకే పరిమితమైన ఆన్ లైన్ మీడియాను ఏపీ, తెలంగాణల్లో తీసుకొచ్చి పాఠకులకు చేరువ చేస్తున్న పొలిటికల్ ఫ్యాక్టరీ యాజమన్యాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ చానల్ తీసుకొచ్చిన ఆ సంస్థ సీఈవో చీఫ్ ఎడిటర్ రమేశ్ సృజనాత్మకత గల సీనియర్ జర్నలిస్ట్ అని.. ఆయన ఆలోచనకు  ప్రతిరూపమే ఈ వెబ్ చానల్ అన్నారు. పీఎఫ్ అనేది కొత్త పదం.. రమేశ్ కొత్త కొత్త ఆవిష్కరణలతో సక్సెస్ కు చిరునామాగా నిలుస్తున్నారని కొనియాడారు. 17 ఏళ్ల క్రితం అన్న పత్రిక ప్రారంభించారని.. నేడు పొలిటికల్ ఫ్యాక్టరీతో వెబ్ మీడియాలో విస్తృత పరిచే ప్రయోగం చేశారంటూ కొనియాడారు.  రమేశ్.. అందరూ నడిచే దారిలో కాకుండా తనకంటూ సొంత దారిలో వెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడన్నారు. నూతన మార్గాన్ని ఎంచుకున్న రమేశ్ కు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ మాట్లాడుతూ.. పొలిటికల్ ఫ్యాక్టరీ లాంటి తెలుగు వెబ్ చానెల్ తీసుకొచ్చిన రమేశ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ప్రయత్నం చేస్తే చివరి వరకు లాక్కెళ్లే శక్తి రమేశ్ కు ఉందన్నారు. సో షల్ మీడియా విస్తరించిన వేళ అవకాశాలను అందిపుచ్చుకునేలా రమేశ్ చేసిన వెబ్ చానల్ అందరనీ అశ్చర్యపరుస్తోందన్నారు. కానీ ప్రభుత్వాలు ఈ వెబ్ చానళ్లను ఆదరించడం లేదన్నారు. న్యూస్ మీడియా అంతా కొన్ని, పత్రికలు, చానల్స్ చుట్టూనే తిరుగుతోందని.. పొలిటికల్ ఫ్యాక్టరీ లాంటి వెబ్ చానల్ లు దూసుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వాలు ఆదరించి ప్రభుత్వం నుంచి ప్రొత్సాహం అందించాలని కొనియాడారు. ఇలాంటి అద్భుత చానల్ తీసుకొచ్చినందుకు  రమేశ్ ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన ఈ సంస్థను ఆయన స్పూర్తితో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

అనంతరం వర్ధమాన సినీ నటి పద్మా గంగావత్ ను పొలిటికల్ ఫ్యాక్టరీ సీఈవో చీఫ్ ఎడిటర్ అయిలు రమేశ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, విరాహత్ అలీ, నరేందర్ రెడ్డి పాత్రికేయులు, సినీ కళాకారులు ఘనంగా సన్మానించారు. మారుమూల వరంగల్ గిరిజన తండా నుంచి తెలుగు హీరోయిన్ గా ఎదిగిన ఆమెపై అతిథులు పొగడ్తల వర్షం కురిపించారు. ఒక బంజారా మారుమూల అమ్మాయిని సినిమాల్లోకి తెచ్చిన ఆర్ నారాయణమూర్తిని అభినందించాన్నారు. తెలంగాణ న్యూస్ లలో పద్మ కు ప్రాధాన్యతనిచ్చి గుర్తించాలని అతిథులు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు  వై నరేందర్ రెడ్డి, కోటిరెడ్డి , రాజేష్, సంపత్, , దర్శకుడు నటుడు రఫీ, హీరోయిన్ పద్మా గంగావత్ , సంగీత దర్శకుడు బొంబాయి బోలే, వైసీపీ నాయకుడు గట్టు రాంచంద్రరావు, నటుడు పొట్టి వీరయ్య, నిర్మాత, దర్శకులు నర్సింహా, యాదగిరి, పొలిటికల్ ఫ్యాకరీ డైరెక్టర్లు వంశీ, స్పందన, డెస్క్ ఇన్ చార్జి నరేశ్,  సబ్ ఎటిటర్ నాగరాజకుమారి, రేఖరాణి, పామరాజ రామారావు లు, పెసరు వీరారెడ్డిలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.