భవన మరమ్మత్తు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

కరీంనగర్: కలెక్టరేట్ భవన మరమ్మత్తు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం ఎన్.టి.పి.సి. వారి సౌజన్యంతో మరమ్మత్తులు, సుందరీకరణ పనులపై ఆయా అధికారులతో సమీక్షించారు. అదే విధంగా కలెక్టరేట్ భవనము మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని పలు విభాగాల్లోని మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. కలెక్టరేట్ కాంపౌండ్ పరిధిలో పరిసరాలను పరిశుభ్రపరచి మొక్కలను నాటాలని అన్నారు. ఇంకుడు గుంతలను ఆమె పరిశీలించారు. జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, పరిపాలనాధికారి రవీందర్, కలెక్టరేట్ లోని విభాగాలు, శాఖలు, భవనాలను పరిశీలించాలని ఆమె ఆదేశించారు. ఆమె వెంట జాయింట్ కలెక్టర్ శ్రీదేవ సేన, ఆర్అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, పాల్గొన్నారు. అనంతరం జిల్లా గ్రంధాలయ సంస్ధను ఆమె పరిశీలించారు. గ్రంధాలయానికి ఎంత మంది పాఠకులు వస్తున్నారు. ఎలాంటి పుస్తకాలు ఉన్నాయని ఆమె అడిగి తెలుసుకున్నారు. గ్రంధాలయానికి కావలసిన కుర్చీలు, ప్రొజెక్టర్, పుస్తకాలు, కంప్యూటర్ లను సమకూరుస్తామని అన్నారు. ఆ తరువాత బాలసదనాన్ని సందర్శించి అక్కడ చిన్నారులను ఎత్తుకొని ముద్దాడారు. శిశువులకు అందిస్తున్న భోజనం, ఫీడింగు వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్ధుల సంరక్షణ అందిస్తున్న భోజనం, ఇతర సదుపాయాలను విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కొత్తగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని ఆమె సందర్శించారు. చిన్నపిల్లలకు బిస్కట్లు, చాక్లెట్లను కలెక్టర్ అందజేశారు. సదనంలోని వంటగదిని ఆమె సందర్శించారు. సదనం ఆవరణలో గులాబి మొక్కను కలెక్టర్ నాటారు. అక్కడనుంచి పట్టణంలోని బస్టాండు ఎదురుగా ఉన్న బాలభవన్ ను ఆమె సందర్శించారు. బాల భవన్ ద్వారా పిల్లలకు నేర్పుతున్న వివరాలను అక్కడి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. బాల భవన్ కు భవనం కావాలని నిర్వాహకులు కలెక్టర్ ను కోరారు.

NETHU PRASAD     nethu prasad.     NEETHU PRASAD     neethu prasad..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *