
హైదరాబాద్ లోని భవన నిర్మాణంలో ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు కార్మికులు కుటుంబ సభ్యులకు రూ. 12.60 లక్షలను రాష్ట్ర్ర హోం కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అందజేశారు. సచివాలయంలో తన చాంబర్లో వారికి ఒక్కొక్కరికి రూ. 6.30 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని మెహిది పట్నం ప్రాంతంలో భవన నిర్మాణంలో పనిచేస్తున్న జి. నగేష్, క్రిష్ణయ్య అనే కార్మికులు ప్రమాదవశాత్తు గత ఆగష్టు 16వ తేదిన చనిపోయారు. నగేష్ మెహిది పట్నం లోని బోజగుట్ట నివాసి కాగా, క్రిష్ణయ్య మహబూబ్ నగర్ జిల్లాలోని గురుకుంట గ్రామస్ధుడు. వారు చనిపోయిన 24 రోజులలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి అధికారుల లబ్ధిని చేకూర్చే ప్రక్రియ పూర్తి చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు త్వరితగతిన ఆర్ధిక అబ్ధిని అందజేసేందుకు కృషి చేశారు. నగేష్ బార్య కవితకు, క్రిష్ణయ్య సతీమణి రేవతికి రూ. 6.30 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. నెల తిరక్కుండానే తమకు ఆర్ధిక సహయం చేసినందుకు వారు ముఖ్యమంత్రికి, హోం మరియు క
కార్మిక శఆఖా మంత్రికి కృతజ్ఞతలు తెలిజజేశారు.