భర్త వేరే మహిళతో ఉండగా దొరకబట్టిన భార్య

condacter

కరీంనగర్ : కరీంనగర్ ఆర్టీసీ 1 డిపోలో కండెక్టర్ గా పనిచేస్తున్న కల్లూరి రమేశ్ కొంత కాలంగా భార్య పిల్లలను వదిలేసి వేరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీనిపై ఎంతో కాలంగా భార్య పిల్లలు భర్త రమేశ్ ను చాలా సార్లు నిలదీశారు. దీంతో కండక్టర్ రమేశ్ ఇంటి నుంచి వెళ్లిపోయి కోతిరాంపూర్ లో వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటున్నారు.

దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు రమేశ్ ఆ మహిళతో ఉండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంట్లో ఉంచి తాళం వేసి మీడియాను, పోలీసులను పిలిపించారు. అనంతరం తలుపులు పగులకొట్టి వారిద్దరిని బయటకు తీసుకొచ్చి దేహశుద్ది చేశారు. కాగా కోపంతో భర్త రమేశ్ భార్యపై కత్తెర తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ఆస్పత్రి పాలైంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *