భర్త మర్మాంగం కోసేసిన భార్య

knife

అనుమానం పెనుభూతమై పోయింది. భర్త అనుమానిస్తున్నాడని.. నిత్యం వేధిస్తున్నాడని భర్య తిరగబడింది. ఏకంగా భర్త మర్మాంగాన్ని కోసేందుకు ప్రయత్నించింది.

హైదరాబాద్ సమీపంలోని మెహదీపట్నం అంబేద్కర్ నగర్ లో సతీష్(35), భార్య(30), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. సతీష్ కూలీ కాగా, భార్య ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ చేస్తోంది. సతీష్ భార్యను అనుమానించడంతో పాటు మద్యానికి బానిసై వేధిస్తున్నాడు.వేధింపులు తట్టుకోలేక అతడిని అంతమొందించాలనుకుంది.

ఆదివారం పీకలదాకా తాగివచ్ిచ పడుకున్న భర్త మర్మాంగాన్ని కొడవలితో కోయడానికి ప్రయత్నించింది. గాయపడ్డ సతీష్ కేకలు వేయడంతో భార్య ఇద్దరు పిల్లలతో ఇంటికి తాళం వేసి పరారైంది. సతీష్ కేకలు విన్న చుట్టుపక్కల వారు పోలీసుల సాయంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *