Breaking News

భద్రాద్రిలో వైభవంగా జగత్కల్యాణం

భద్రాద్రిలో వైభవంగా జగత్కల్యాణం

ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.

భద్రాద్రి : శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాద్రి క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన మిథిలా ప్రాంగణంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ మెడలో స్వామివారు మాంగల్యధారణ చేశారు.  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు  ప్ర‌భుత్వం త‌ర‌పున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అభిజిత్‌ లగ్నంలో జరుగుతున్న జగత్కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో భద్రాద్రికి తరలివచ్చారు. ఈ కల్యాణ మహోత్సవంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ , సీఎం కుటుంబ సభ్యులతో పాటు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కుటుంబ స‌భ్యులుపాల్గొన్నారు.

indrakaran reddy new 2     indrakaran reddy new 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *