భట్టిని తొక్కేస్తున్న ఉత్తమ్

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రాజకీయంగా, అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క ఉత్తమ్ కంటే స్పీడ్ గా దూసుకెళ్తూ కార్యకర్తల మనుసు దోచుకుంటున్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్తూ కాంగ్రెస్ నాయకులను అక్కున చేర్చుకుంటూ పార్టీలో కదలిక తెస్తున్నారు. ఇప్పుడు ఇదే దూకుడు ఆయనపై ఉత్తమ్ కోపానికి కారణమైంది.

పీసీసీ చీఫ్ గా ఎన్నికైన ఉత్తమ్ ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలను రూపొందించలేదు. స్తబ్దుగా పాలిస్తున్నారు. అదే మల్లు భట్టి కాంగ్రెస్ ఊపుకు కారణమవుతున్నాడు. దీంతో సహజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి వైఖరిపై గుర్రుగా ఉన్నాడట.. అందుకే ఆయనను ఆ పదవి నుంచి తప్పించి  వేరే పగ్గాలు అప్పగించాలని ఉత్తమ్ యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఉత్తమ్ స్పందించలేదు. కానీ భట్టి మాత్రం మా మధ్య విభేదాలులేవని తేల్చిచెప్పారు.

కానీ ఇది చిలికి చిలికి కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయానికి గురిచేస్తోంది. ఉత్తమ్, భట్టి ల వైరం పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని కార్యకర్తలు లోలోన భయపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *