
భజరంగీ భాయ్ జాన్ .. ఎంతో హిట్ సినిమానో మనకు తెలిసిందే.. పాకిస్తాన్ మూగబాలికను పాకిస్తాన్ చేర్చి సినిమా హిట్ కొట్టాడు హీరో సల్మాన్.. కానీ పాకిస్తాన్ చేరిన భారత మూగ బాలిక ఇప్పటికీ అక్కడ తన తల్లిదండ్రులను చేరేందుకు ఆరాటపడుతోంది.. ఇది నిజంగా వాస్తవ ఘటన..
10 ఏళ్ల క్రితం పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్లిన ఆ మూగబాలికను పాకిస్తాన్ పంజాబ్ రేంజర్లు చేరదీసి అనాథల ఫౌండేషన్ కు అప్పగించారట.. ఇప్పుడామే వయసు 23 ఏళ్లు.. తను మూగ, చెవిటి.. ఆమె తల్లిదండ్రుల కోసం భారత్ లో విస్తృతంగా గాలించినా ఫలితం లేదట.. దీంతో ఆ ఆనాథాశ్రమం నిర్వాహకులు భజరంగీ సినిమా చూసి ఇన్ స్పైర్ అయ్యారు. ఆ బాలిక వివరాలను మీడియాకు వివరించారు.