Breaking News

భగీరథ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్ ఏజెన్సీలను తొలగిస్తాం

భగీరథ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్ ఏజెన్సీలను తొలగిస్తాం

భగీరథ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్ ఏజెన్సీలను 60 C నిబంధన కింద తొలగించడానికి కూడా వెనుకాడమన్నారు RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి. గడువు లోగా మంచినీళ్లు అందించే క్రమంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని RWS&S కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్.ఈ,ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఈ.ఎన్.సి, పైప్ లైన్ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. రాత్రి సమయంలో కూడా పైప్ లైన్ పనులు జరిగేలా చూడాలన్నారు. సూర్యాపేట డివిజన్ లో భగీరథ పనులు మందకోడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ.ఎన్.సి, సంబంధిత వర్క్ ఏజెన్సీ ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఈఈని ఆదేశించారు. పాత మెదక్ జిల్లాలో వ్యవసాయభూముల కారణంగా ఆగిన పైప్ లైన్ పనులను వెంటనే మొదలుపెట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన OHSR నిర్మాణాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మెటీరియల్, మెన్ కొరత లేకుండా చూడాలన్నారు. ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ కు సరైన సమాచారంతో రాని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో RWS&S ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు సురేష్ కుమార్, కృపాకర్ రెడ్డి, కన్సల్టెంట్లు నర్సింగరావు,శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *