భగీరథుడి కోసం రఘువీర్ సింగ్ పాదయాత్ర

సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మహా’ పట్టుదలకు గులాం అయ్యి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రఘువీర్ సింగ్ కరీంనగర్ జిల్లా జూలపల్లి నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ప్రస్తుతం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ చేరుకుంది. హైదరాబాద్ పాదయాత్రగా వెల్లి నాయకులు కేసీఆర్ ను కలిసి తమ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని గోదావరిపై బ్యారేజీలు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు నడుం బిగించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కు క్షీరాభిషేకాలు, అభినందన సభలు నిర్వహించారు.

కానీ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రఘువీర్ సింగ్ మాత్రం కేసీఆర్ భగీరథ యత్నానికి మద్దతుగా కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం నుంచి 100 మందితో పాదయాత్ర చేపట్టారు. హైదరాబాద్ కు పాదయాత్రగా వెళ్లి సీఎం కేసీఆర్ ను అభినందించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే మూడు రోజుల క్రితం ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ చేరుకుంది. నాయకులకు రహదారి పొడవునా తెలంగాణ వాదులు ఘనస్వాగతం పలుకుతూ అభినందనలు తెలుపుతున్నారు. రఘువీర్ సింగ్ చేపట్టిన పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు.

కాగా రఘువీర్ సింగ్ మాట్లాడుతూ . ‘మహారాష్ట్రతో తెలంగాణ ప్రాజెక్టులపై చేసుకున్న ఒప్పందం సంతోషమని.. దీనివల్ల ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇంతటి మహా ఒప్పందాన్ని చేసుకున్న కేసీఆర్ ను అభినందించడానికే తాను ఈ పాదయాత్ర చేపట్టానని.. విలేకరులతో తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *