Breaking News

భక్తజనసంద్రంగా మేడారం జాతర

భక్తజనసంద్రంగా మేడారం జాతర

సమ్మక్క-సారక్కలకు మొక్కులు చెల్లించుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం నుంచి రాత్రి వరకు సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి కడియం, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మేడారం, ఫిబ్రవరి 2 : సమ్మక్క-సారక్కలు గద్దెల మీదకు రావడంతో నేడు (ఫిబ్రవరి రెండో తేదీన) తల్లులను కొలిచి మొక్కులు సమర్పించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మేడారం జనసంద్రమైంది. ఎక్కడా చూసినా సమ్మక్క-సారక్కల నామస్మరణతో మోగిపోయింది.  నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసిఆర్ లు కూడా వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో మేడారం జాతర జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక రికార్డులు సాధించిందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసి జాతర అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఇక దేశంలో దీనిని గొప్ప జాతరగా మార్చేందుకు, వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు 200 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు , వచ్చే ఏడాది నాటికి సౌకర్యాలన్నింటిని కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు.  ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి , దేవాదాయ-ధర్మాదాయ శాఖ మంత్రి గత మూడు రోజులుగా మేడారంలోనే ఉంటూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసిఆర్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్న సందర్భంగా ఉదయం నుంచే గద్దెల వద్ద భక్తుల తాకిడిని నియంత్రించే విధంగా పోలీసులకు సూచనలు, సలహాలు ఇస్తూ అక్కడే గంటల కొద్ది మకాం వేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఉదయం సాదరంగా ఆహ్వానించి సమ్మక్క-సారక్కల దర్శనానికి తీసుకెళ్లారు.

kcr 1     kcr 2    kcr 6

అనంతరం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసిఆర్ ను, ఆయన కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించి తల్లుల దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రాక సందర్భంగా భక్తులను కొద్ది సేపు దర్శనానికి ఆపి, సజావుగా దర్శన కార్యక్రమం పూర్తి చేయించారు.  ముఖ్యమంత్రి కేసిఆర్ దర్శనం చేసుకుని వెళ్లిన తర్వాత మళ్లీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ- ధర్మాదాయ శాఖ మంత్రి ఐకె రెడ్డిలు గద్దెల వద్ద భక్తుల తాకిడి చూసి అక్కడే ఉండి పోలీసులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండ చూడాలని పోలీసులకు సూచించారు. ప్రపంచంలోనే గొప్ప ఆదివాసి జాతర కావడంతో దాదాపు కోటిన్నర మంది దర్శించుకునే మహా జాతర కావడంతో దీనిని సజావుగా నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు జనాల్లోకి వెళ్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ అధికారులకు తగిన సలహాలు ఇస్తూ పరిష్కరించారు.

kcr 3     kcr 4    kcr 5

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *