బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స‌మీక్ష

– గృహ నిర్మాణ,దేవాదాయ,న్యాయ‌శాఖ‌ల బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స‌మీక్ష

– డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ నిర్మాణ అంచ‌నా వ్య‌యంపై చ‌ర్చ

– 2017-18 బ‌డ్జెట్ లో గృహ నిర్మాణ శాఖ  అంచ‌నా సుమారు 5 వేల కోట్లు

– ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 1400 ఇళ్లు

– GHMC ,సీయం ప్ర‌త్యేక కోటా మిన‌హా 95 నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌క్ష 33 వేల ఇండ్లు

 

– హైదరాబాద్‌ రానున్న బడ్జెట్‌లో గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖల బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై  ఆ శాఖల అధికారుల‌తో మంత్రిఇంద్రకరణ్‌రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఉన్నతాధికారులతో 2017-18  బడ్జెట్అంచ‌నాల‌పై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ నిధులుకేటాయించాలని ఆర్థిక శాఖ‌ను కోర‌నున్నారు.GHMC ,సీయం ప్ర‌త్యేక కోటా మిన‌హా 95 నియోజ‌క‌వ‌ర్గాల్లో ల‌క్ష 33 వేల ఇండ్ల నిర్మాణంచేప‌ట్ట‌నున్న‌ట్లు అధికారులు మంత్రికి వివ‌రించారు. 95 నియోజ‌క‌వ‌ర్గాల్లో   ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 1400 ఇండ్ల‌ను  కేటాయించ‌నున్నారు.

డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ నిర్మాణానికి రాష్ట్ర బ‌డ్జెట్  అంచ‌నా వ్య‌యం సుమారు 3 వేల కోట్ల అంచ‌నా కాగా , హ‌డ్కో నుంచి సుమారు  రూ. 17 వేలకోట్ల రుణం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ట్లు అధికారులు ప్ర‌తిపాద‌న‌లు రూపోందించారు.  మొత్తం మూడు ల‌క్ష‌ల ప‌దివేల డ‌బుల్ బెడ్ రూంఇండ్ల నిర్మాణానికి సుమారు 20 వేల కోట్ల వ్య‌యం  అవుతున్న‌ట్లు అధికారులు ప్ర‌తిపాద‌న‌లు రూపోందించారు. ఈ స‌మీక్ష‌లో గృహ నిర్మాణశాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ చిత్రా రామ‌చంద్ర‌న్ , హౌజింగ్ కార్పోరేషన్ చీఫ్ ఇంజ‌నీర్ ఈశ్వ‌ర‌య్య‌తో పాటు ఇత‌ర అధికారులు పాల్గోన్నారు.

 

దేవాదాయ శాఖ 2017-18 బ‌డ్జెట్ అంచ‌నా వ్య‌యం రూ.100 కోట్లు

దేవాదాయ శాఖ 2017-18 బ‌డ్జెట్ అంచ‌నాల‌పై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆ శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. బ‌ల‌హీన వ‌ర్గాల కాల‌నీల్లో కామ‌న్ గుడ్ ఫండ్ ప‌థ‌కం కింద నిర్మించే ఆల‌యాల‌కు సుమారు 100 కోట్ల రూపాయాల అంచన వ్యయంగా అధికారులు ప్ర‌తిపాద‌న‌ల‌నుసిధ్దం చేశారు. వ‌చ్చే బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు నిధులు కేటాయించాల‌ని ఆర్థిక శాఖను కోర‌నున్నారు.  ఈ సమీక్ష‌లోదేవాదాయ శాఖ జాయింట్ క‌మిష‌న‌ర్ శ్రీనివాస‌రావు, స్పెష‌ల్ డిఫ్యూటీ క‌లెక్ట‌ర్ శ్రీనివాస రెడ్డి, డిఫ్యూటీ సెక్ర‌ట‌రీ ర‌మేష్ తో పాటు ఇత‌రఅధికారులు పాల్గోన్నారు.దీంతో పాటు న్యాయ శాఖ కు సంబంధించిన బడ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై న్యాయ శాఖ సెక్ర‌ట‌రీ సంతోష్ రెడ్డితో చ‌ర్చించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *