Breaking News

బ్లూ ఫిల్మ్ ల మాయలో హింస

turket

-ఒత్తిడి చేయడంతో భర్త గొంతుకోసిన భార్య
అశ్లీల చిత్రాలను చూడడం సర్వసాధారణమైపోయింది.కానీ కొందరు వీటినే అన్వయించుకొని వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కట్టుకున్న భార్యను బ్లూ ఫిల్మ్ లో చేసే విధంగా చేయాలని చిత్రహింసలు పెట్టడంతో విసుగు చెందిన ఆ భార్య భర్త గొంతు కోసేసి చంపేసింది. ఈ ఘటన టర్కీలోని సెంట్రల్ ఇస్పార్తా ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

టర్కీలో గోనుల్(49) అనే మహిళ విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. ఆమె పై కన్నేసి 67 ఏళ్ల వృద్ధుడు మంచి జీవితం ఇస్తానని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక అసలు రూపం బయటపెట్టాడు. అశ్లీల చిత్రాలు చూసి అందులో ఉన్నట్టు చేయమని బలవంతం చేసేవాడు. తిరస్కరిస్తే దారుణంగా కొట్టేవాడని మహిళ తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా మారలేదని.. తన కొడుకుతో గొడవకు దిగి నానా బీభత్సం చేశాడని మహిళ వాపోయింది. దీంతో విసిగిపోయిన ఆమె ఆ భర్త గొంతు కత్తితో కోసేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *