
బ్రిస్బేన్, ప్రతినిధి : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో శనివారం నాలుగో రోజు భారత్ 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. 71/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కు వరుస కట్టారు.
కోహ్లి ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. రహానే పది పరుగులు చేశాడు. ధోని, రోహిత్ శర్మ డకౌటయ్యారు. ధావన్(26) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ జాన్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. హాజల్‌వుడ్, స్టార్క్, వాట్సన్ తలో వికెట్ తీశారు. 160/7 స్కోరుతో భారత్ ఆట కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 408 పరుగులకు, ఆస్ట్రేలియా 505 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. ప్రస్తుతం 66 పరుగుల ఆధిక్యంలో భారత్ మ్యాచ్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే.. క్రీజులో ధావన్, ఉమేశ్ యాదవ్ లు ఉన్నారు. కాబట్టి ఆస్ట్రేలియాకు విజయం కొద్ది దూరంలో ఉంది.