బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది తీర్పు తర్వాతే కృష్ణా బోర్డు పరిధి ఖరారు.

బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది తీర్పు తర్వాతే కృష్ణా బోర్డు పరిధి ఖరారు.

ఎఫ్.ఆర్.బి.ఎం.పరిధిలోకి రాకుండా నిధులు.

దేవాదులకు 450 కోట్లు,బీమాకు 35 కోట్లు విడుదల చేయాలి.

పట్టిసీమలో తెలంగాణ హక్కు 45 టి.ఎం.సి.లు.

కాళేశ్వరంకు త్వరలో గడ్కరీ, హర్షవర్ధన్.

అసంపూర్తిగా ముగిసిన జలవనరుల సమావేశం.

మంత్రి హరీష్ రావు.

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు తర్వాతనే కే.ఆర్.ఎం.బీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకురావాలని టి.ఎస్. ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కోరారు. అప్పుడే రాష్ట్రాలకు కేటాయించిన నీటిని విజయవంతంగా వినియోగించుకోవచ్చునని ఆయన చెప్పారు. గురువారం ఇక్కడ కేంద్ర జలవనరుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీదిఆతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టులో తెలంగాణాకు 45టీఎంసీల హక్కు ఉందని వాదించినట్టు హరీశ్ రావు తెలిపారు.ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసిందన్నారు.వచ్చే సమావేశంలోనైనా స్పష్టత వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రులు గడ్కరీ, హర్షవర్దన్ లను ఆహ్వానించానని మంత్రి తెలిపారు. అందుకు వారు సుముఖత చూపారని అన్నారు.అభినందనలతో పాటు ఆర్థిక సహాయం కూడా చేయాలని గడ్కరీని కోరినట్టు హరీశ్ రావు చెప్పారు.ఏఐబీపీ  క్రింద తెలంగాణ నుంచి ఎంపికైన 11 ప్రాజెక్టుల్లో ఇప్పటికే 2 ప్రాజెక్టులు పూర్తయ్యాయని,మరో ఆరు ప్రాజెక్టులు జూన్ 2018కి పూర్తికానున్నాయని మంత్రి తెలియజేశారు. 2019 మార్చి టార్గెట్ గా చేసుకొని మిగిలిన ప్రాజెక్టులను పూర్తిచేయనున్నట్టు ఇరిగేషన్ మంత్రి చెప్పారు.. “క్యాడ్వామ్” క్రింద అడిగిన వెయ్యి కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని మంత్రి కోరారు.అందులో  దేవాదులకు కేటాయించిన 450కోట్ల రూపాయలను వెంటనే విడుదలచేయాలని కోరారూ.భీమా ప్రాజెక్టుకు రావాల్సిన 35కోట్ల రూపాయలను కూడా వెంటనే విడుదలచేయాలని కోరినట్టు ఆయన చెప్పారు..ఎఫ్ఫార్బీఎం పరిధిలోకి రాకుండా నాబార్డు ద్వారా రాష్ట్రాలకు నిధులు ఇచ్చినప్పుడే కేంద్రప్రభుత్వం చేపట్టిన లక్ష్యాలను చేరవచ్చని తాను వివరించానని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

అప్పుడే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయి రైతులకు మేలు జరుగుతుందన్నారు.తన అభిప్రాయాలతో కేంద్రమంత్రి గడ్కరీ సూత్రప్రాయంగా ఏకీభవించారని హరీశ్ రావు చెప్పారు.అన్ని రాష్ట్రాలమంత్రుల అభిప్రాయలతో నివేదిక సమర్పిస్తే క్యాబినెట్ ముందు పెడ్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్టు మంత్రి చెప్పారు.  డిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ తో మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. సీతారామ ప్రాజెక్టు పర్యావరణ, వన్యప్రాణి అనుమతులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ను అడిగామని చెప్పారు.పాలమూరు రంగారెడ్డి మొదటి దశ అటవీ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు హరీశ్ రావు చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు చెప్పామని మంత్రి పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *