
బాబ్రీ కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా 20మందికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇవ్వాలంటూ 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం సూచించింది.
2010 అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సహా ఉమాభారతి తో పాటు 19మందికి ప్రమేయం లేదని వారిని నిర్ధోషులుగా విడుదల చేసింది. దానిపై సున్నీం వక్ఫ్ బోర్డు సుప్రీంలో సవాలు చేసింది. ఆ పిటీషన్ పై సుప్రీం స్పందించింది. ఆ పీటీషన్ పై సమాధానం ఇవ్వాలని 4 వారాల గడువు ఇస్తూ అద్వానీ, మురళీ సహా 20 మందికి నోటీసులు ఇచ్చింది.