Breaking News

బ్రహ్మం గారి మఠం వద్ద వింత

కడప,ప్రతినిధి : బ్రహ్మంగారి మఠం వద్ద వింత చోటుచేసుకుంది. బ్రహ్మం గారు చెప్పినట్టే ఇప్పుడు జరుగుతోందని భక్తులు భావిస్తున్నారు.

ఇరవేళ్ల క్రితం వెంకటయ్య అనే సాధువు మఠంకు వచ్చాడు. ఆయన నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. ఆయన సమాధిని నాలుగేళ్ల క్రితం అక్కడే సమాధి చేశారు. కాగా ఆ స్థలాన్ని తదనంతరం  వేరొకరికి అమ్మేశారు. ఆ స్థలంలో ఇప్పడు కొత్తగా నిర్మాణం చేస్తుండగా.. ఆయన శరీరం బయటపడింది. నాలుగేళ్ల క్రితం పూడ్చిపెడితే బొక్కలు మాత్రమే కనిపించాలి. కానీ ఇక్కడ ఆయన శరీరం చెక్కుచెదరలేదు. పూడ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు అలానే ఉంది. ఈ వింత చూడడానికి జనం ఎగబడుతున్నారు. బ్రహ్మంగారి మఠం వద్ద చోటుచేసుకున్న ఈ వింత ఆయనే కలియుగానికి ఏదోచెప్పాలనే ఇలా చేశారని మఠం నిర్వాహకులు అంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *