బోర‌బండ రోడ్డు విస్త‌ర‌ణ‌తో సైబ‌ర్ ట‌వ‌ర్‌కు వెళ్ల‌డానికి మార్గం సుగ‌మం

నాలుగు ద‌శాబ్దాల రోడ్డు విస్త‌ర‌ణ స‌మ‌స్యకు మ‌న‌న‌గ‌రం ప‌రిష్కారం

బోర‌బండ రోడ్డు విస్త‌ర‌ణ‌కు గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా ఉన్న గ్ర‌హ‌ణానికి రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు చొర‌వ‌తో ప‌రిష్కారం ల‌భించింది. అత్యంత ర‌ద్దీగా, అధిక సంఖ్య‌లో వాహ‌నాల‌తో కూడిన బోర‌బండ బ‌స్టాప్ నుండి హైటెక్ టీ-పాయింట్ వ‌ర‌కు ఉన్న మూడు కిలోమీట‌ర్ల రోడ్డు విస్త‌ర‌ణ‌కు ఇటీవ‌ల కూక‌ట్‌ప‌ల్లిలో మంత్రి కె.టి.ఆర్ నిర్వ‌హించిన మ‌న న‌గ‌రంలో గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. ఈ మూడు కిలోమీట‌ర్ల మార్గంలో 219 ఆస్తులను సేక‌రించాల్సి ఉండ‌గా బోర‌బండ నివాసుల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా రోడ్డు విస్త‌ర‌ణ‌కు అంగీక‌రించాల్సిందిగా ఈ 219 ప్రాప‌ర్టీదారుల‌ను డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ ఒప్పించారు. దీంతో ఆస్తుల సేక‌ర‌ణ‌కు ఈ మార్గంలో ర‌హ‌దారికి ఎడ‌మ‌వైపు ఉన్న 113, కుడి వైపు ఉన్న 106 ఆస్తుల సేక‌ర‌ణ‌కు జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీచేశారు. వీటిలో 181 ప‌క్కా భ‌వ‌నాలు, 33 తాత్కాలిక నివాసాలు, నాలుగు ప్రార్థ‌న స్థ‌లాలు ఉన్నాయి. ఈ 219 ప్రాప‌ర్టీల‌లో 154మంది రోడ్డు విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించడానికి స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చార‌ని డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ తెలిపారు. న‌ష్ట‌ప‌రిహారాన్ని అందించే ప్ర‌క్రియ‌ను ప్రారంభించామ‌ని తెలిపారు. శుక్ర‌వారం నాడు బోర‌బండ ఎన్‌.ఆర్‌.ఆర్‌పురంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌లు రూ. 73,60,836 ప‌రిహారాన్ని ఆరుగురు ల‌బ్దిదారుల‌కు అంద‌జేశారు. మిగిలిన ల‌బ్దిదారుల‌కు కూడా త్వ‌రిత‌గ‌తిన ప‌రిహారాన్ని అంద‌జేయ‌నున్న‌ట్టు బాబా ఫ‌సియుద్దీన్ తెలిపారు. కాగా ఈ రోడ్డు విస్త‌ర‌ణ‌తో ఎర్ర‌గ‌డ్డ నుండి బోర‌బండ మీదుగా సైబ‌ర్ ట‌వ‌ర్ వ‌ర‌కు వెళ్ల‌డానికి షాట్‌క‌ట్‌గా ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *