Breaking News

బోయినపల్లి మార్కెట్ దశను మార్చిన హరీష్

download

హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ ప్రజల కూరగాయల అవసరాలు తీర్చిన బోయినపల్లి మార్కెట్ ను అభివృద్ది చేయడంలో నాటి పాలకులు విస్మరించారు. పెద్దదైన ఈ మార్కెట్ తెలంగాణ ఏర్పడ్డాక తన దశదిశను మార్చుకోంది. మార్కెటింగ్ శాఖ మంత్రిగా హరీష్ బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్ మార్కెట్ల దశదిశను మార్చేశారు..

6 నెలల కింద బోయినపల్లి మార్కెట్ కు నిధులు మంజూరు చేసిన హరీష్ ఈరోజు ఉదయం బోయినపల్లి మార్కెట్లో హమాలీ విశ్రాంతి భవనం, మన కూరగాయలు భవన సముదాయం భవానాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

రూ.2.5 కోట్లతో రెండు భవన సముదాయాలను నిర్మించామని.. బోయినపల్లి మార్కెట్ యార్డులో రూ.9కోట్లతో శీతత గిడ్డింగులను నిర్మిస్తామని తెలిపారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని కోహెడలో వంద ఎకరాల్లో పండ్ల శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పటాన్ చెరులో 15 ఎకరాల్లో ఉల్లిగడ్డ మార్కెట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతీ మార్కెట్ యార్డులో ప్రాథమిక చికిత్స కేంద్రం, హమాలీలకు రూ.2 లక్షల బీమా అమలుచేస్తామని.. బోయినపల్లికి వచ్చే కూరగాయల వాహనాలకు పన్ను రద్దు చేస్తామని మంత్రి ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *